Korean Embassy India : కొత్తకారుకి భారతీయ సంప్రదాయ పూజలు.. దక్షిణ కొరియా అంబాసిడర్‌పై నెటిజన్లు ప్రశంసలు

ఇండియాలో ఉన్న దక్షిణ కొరియా అంబసీ కొత్తకారును కొనుగోలు చేసింది. దానికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. దక్షిణ కొరియా అంబాసిడర్ చాంగ్ జే-బోక్ పూజలు చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Korean Embassy India : కొత్తకారుకి భారతీయ సంప్రదాయ పూజలు.. దక్షిణ కొరియా అంబాసిడర్‌పై నెటిజన్లు ప్రశంసలు

Korean Embassy India

Updated On : September 26, 2023 / 5:13 PM IST

Korean Embassy India : దక్షిణ కొరియా అంబాసిడర్ పూజా కార్యక్రమంతో కొత్తకారుకి వెల్కం చెప్పారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

South Korea : ఉత్తర కొరియా బెదిరింపుల నేపథ్యంలో దక్షిణ కొరియా భారీ సైనిక కవాతు

ఇండియాలోని దక్షిణ కొరియా రాయబార కార్యాలయంలో అంబాసిడర్ చాంగ్ జే-బోక్ కోసం కొత్త కారు కొనుగోలు చేసారు. దీనికి ప్రత్యేక పూజలు చేసారు. ఎంబసీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసారు.

South Korean: తన ప్రియుడిని వెతుక్కుంటూ భారత్‌కు దక్షిణ కొరియా అమ్మాయి

‘అంబాసిడర్ అధికారిక వాహనంగా కొత్త హ్యుందాయ్ జెనెసిస్ GV80 ని కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నాము. మంచి జరగాలని పూజ నిర్వహించాము. మా రాయబార కార్యాలయం కొత్త ప్రయాణంలో చేరండి’ అనే శీర్షికతో భారతదేశంలోని కొరియన్ ఎంబసీ వీడియోను షేర్ చేసింది. కొత్త కారు పూజాకార్యక్రమంలో చాంగ్ జే-బోక్ తో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ‘ఈ వీడియో వైరల్ అవుతోంది. మన సంస్కృతిని ఆదరించినందుకు ధన్యవాదాలు.. కొత్త వాహనంతో శుభాకాంక్షలు’ అంటూ అందరూ నెటిజన్లు విష్ చేసారు.