Cyber Attack: 25లక్షల మంది షేర్ మార్కెట్ అకౌంట్ హోల్డర్ల డేటా లీక్

షేర్ మార్కెట్‌లో పెట్టుబడులతో లాభాలు ఆర్జించాలని ఎవరికి ఉండదు. షేర్లు కొనుక్కుని లాభాలు గడించొచ్చని ప్లాన్ చేస్తూనే ..

Cyber Attack: 25లక్షల మంది షేర్ మార్కెట్ అకౌంట్ హోల్డర్ల డేటా లీక్

Cyber Attack

Cyber Attack: షేర్ మార్కెట్‌లో పెట్టుబడులతో లాభాలు ఆర్జించాలని ఎవరికి ఉండదు. షేర్లు కొనుక్కుని లాభాలు గడించొచ్చని ప్లాన్ చేస్తూనే ఉంటారు. అలా లక్షల్లో, కోట్లలో లావాదేవీలు జరిగేటప్పుడు ఎంత పకడ్బందీగా జరగాలి. ఆ రేంజ్ లో సెక్యూరిటీ ఉన్నప్పటికీ సైబరన్ అటాక్ జరిగి దాదాపు 25లక్షల మంది కస్టమర్ల డేటా లూటీ చేసేశారు.

ఇండియాలో రెండో అతిపెద్ద స్టాక్ బ్రోకర్ Upstox అనే రిటైల్ బ్రోకింగ్ ఫామ్ .. నుంచి డేటా లీక్ అయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై స్పందించిన ఆ సంస్థ సెక్యూరిటీస్, కస్టమర్ల ఫండింగ్ అంతా సేఫ్ గా ఉందని అన్నారు. సైబర్ సెక్యూరిటీ ఫామ్ ను ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తుండేందుకు ఆదేశించాం. ఎటువంటి పొరబాట్లు జరగకుండానే చూసుకుంటాం.

హ్యాకర్లు కంపెనీకి సంబంధించిన డేటాను శాంపుల్ గా మాత్రమే డార్క్ వెబ్‌లో ఉంచారు. నగదు మాత్రం లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్లకే ట్రాన్సఫర్ చేస్తారు. ముందస్తు హెచ్చరికగా సెక్యూర్ పాస్ వర్డ్ దాంతో పాటు ఓటీపీతోనే ట్రాన్సాక్షన్ అయ్యేలా చూస్తున్నామని కో ఫౌండర్, సీఈఓ రవికుమార్ ఓ స్టేట్ మెంట్లో చెప్పారు.

రియల్ టైంలో 24గంటలూ మానిటరింగ్ చేసి డేటా బ్రీచ్ కాకుండా చూసుకుంటున్నాం. ఫేస్ బుక్, లింక్ డ్ ఇన్, మొబిక్విక్ లాంటి ఇతర కంపెనీల డేటా బ్రీచ్ అయినట్లుగానే అప్ స్టాక్ అయినట్లు భావిస్తున్నారు. మొబిక్విక్ లో ఉన్న 11కోట్ల కస్టమర్లు డేటా బ్రీచ్ అయినట్లు సమాచారం.