సీఎన్జీ ట్రాక్టర్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి

సీఎన్జీ ట్రాక్టర్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి

India’s first CNG tractor to be launched tomorrow : భారతదేశంలో మొట్టమొదటి సీఎన్జీ ట్రాక్టర్ ను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. కాలుష్యానికి శాశ్వతంగా చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. సీఎన్జీ, ఎలక్ట్రిక్, ఈథనాల్, హై బ్రిడ్ వాహనాల వైపు మొగ్గు చూపే విధంగా తగిన చర్యలు తీసుకొంటోంది.

అందులో భాగంగా డీజిల్ ట్రాక్టర్ ను సీఎన్జీగా మార్చేశారు. దీనిని 2021, ఫిబ్రవరి 12వ తేదీ శుక్రవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. Rawmatt Techno Solutions, Tomasetto Achille లు సంయుక్తంగా..ఈ వాహనాన్ని రూపొందించాయి. రైతుల ఆదాయాన్ని పెంచడం, ఖర్చులు తగ్గించడం ద్వారా గ్రామీణ భారతదేశంలో ఉద్యోగ అవకాశాలను కల్పించడం సహాయపడుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంధనానికి సంబంధించిన విషయంలో ఏటా రూ. లక్షకు పైగానే..ఆదా చేయాల్సి ఉంటుందని, వారి జీవనోపాధిని మెరుగుపర్చడానికి సహాయపడుతుందని వెల్లడించింది.

డీజిల్ నుంచి సీఎన్జీకి మార్చడం ప్రయోజనకరంగా ఉంటుందని, తక్కువ కార్బన్, కాలుష్య కారకాలతో కూడిన స్వచ్ఛమైన ఇంధనం కలిగి ఉందని, వాహన ఇంజిన్ కు ఎలాంటి హానీ ఉండదంటున్నారు. పెట్రోల్ ధరలు హెచ్చుతగ్గుల కంటే..సీఎన్జీ ధరలు స్థిరంగా ఉంటాయని, అంతేగాకుండా..వాహనాల మైలేజ్ ఎక్కువగానే ఉంటుందన్నారు. 12 మిలియన్ వాహనాలను సీఎన్జీగా మార్చాలని లక్ష్యంతో అధికారులున్నారు. సీఎన్జీ మూవ్ మెంట్ లో వివిధ కంపెనీలు, మున్సిపాల్టీలు భాగస్వాములయ్యాయన్నారు. ప్రస్తుతం డీజిల్ ధర ఒక లీటర్ కు రూ. 77.43 కాగా..సీఎన్జీ కిలోకు రూ. 42 మాత్రమేనని..ఇంధన వ్యయంపై 50 శాతం వరకు ఆదా అవుతుంది.