Indore: ఇండోర్‌లో నవరాత్రి వేడుకల్లో విషాదం.. మెట్లబావిలో పడిపోయిన భక్తులు..

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో శ్రీరామనవమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో మెట్ల‌బావిలోకి భక్తులు పడిపోయిన దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

Indore: ఇండోర్‌లో నవరాత్రి వేడుకల్లో విషాదం.. మెట్లబావిలో పడిపోయిన భక్తులు..

Indore Temple Tragedy

Indore Temple Stepwell Collapse : మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో శ్రీరామనవమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో స్థలం సరిపోకపోవటంతో కొందరు భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్ల‌బావిపై కూర్చుకున్నారు. ఎక్కువ మంది భక్తులు అదే ప్రాంతంలో గుమ్మిగూడటంతో ఆ మెట్టు బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది.  25 మందికిపైగా భక్తులు బావిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో 10 మంది మహిళలు ఉన్నారు. అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది కొంత మందిని కాపాడారు. కొందరు భక్తులు మెట్ల భావికి ఉన్న అంచులను పట్టుకొని ప్రాణాలను కాపాడుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

Fire Broke Out : శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. దువ్వ వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం

ప్రమాద విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇండోర్ కలెక్టర్, కమిషనర్ తో ఫోన్‌లో వివరాలు తెలుసుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలతీరును సీఎం చౌహాన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద విషయాన్ని సీఎం శివరాజ్ చౌహాన్ ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేశారు. ఇండోర్ లో జరిగిన ఘటన తనను తీవ్రంగా బాధించిందని ట్విటర్ ద్వారా మోదీ పేర్కొన్నారు. శివరాజ్ చౌహాన్ తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని ప్రధానికి సీఎం చౌహాన్ తెలిపారు.

Goti Talambralu : భద్రాద్రి రామయ్య కల్యాణంలో తలంబ్రాల ప్రత్యేకత

మెట్ల బావిలో చిక్కుకుపోయిన వారంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రిరాజ్ నాథ్ సింగ్ అన్నారు. ప్రమాద విషయం తెలియగానే ఎంతో బాధ కలిగించిందని అన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారు క్షేమంగా బయటపడాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు రాజ్ నాథ్ సింగ్ అన్నారు.