ఇన్సూరెన్స్ వివరాలు.. మీ వాట్సప్ లో

డిజిటల్.. డిజిటల్..డిజిటల్.. ఇప్పుడంతా స్మార్ట్ జనరేషన్. ఏ సమాచారమైనా క్షణాల్లో చేరిపోతుంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు..

  • Published By: veegamteam ,Published On : February 4, 2019 / 08:31 AM IST
ఇన్సూరెన్స్ వివరాలు.. మీ వాట్సప్ లో

డిజిటల్.. డిజిటల్..డిజిటల్.. ఇప్పుడంతా స్మార్ట్ జనరేషన్. ఏ సమాచారమైనా క్షణాల్లో చేరిపోతుంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు..

డిజిటల్.. డిజిటల్..డిజిటల్.. ఇప్పుడంతా స్మార్ట్ జనరేషన్. ఏ సమాచారమైనా క్షణాల్లో చేరిపోతుంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. అరచేతిలో ప్రపంచాన్ని చుట్టిరావచ్చు. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత కొత్త ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ వచ్చేసింది. స్టార్ట్ ప్ కంపెనీల నుంచి బడా కంపెనీల వరకు తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు డిజిటల్ ప్లాట్ ఫాంకు ఫుల్ గా కనెక్ట్ అవుతున్నాయి. కస్టమర్లకు సమాచారాన్ని చేరవేయాలంటే వాట్సప్ ప్లాట్ ఫాంపైనే ఆధారపడుతున్నాయి. అదే బాటలో ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీలు వాట్సాప్ సేవలను ప్రారంభించాయి. ఈ సర్వీస్ లతో ప్రతి కస్టమర్ తన ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను నిమిషాల్లో తెలుసుకునే సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది ఎల్ ఐసీ.

ప్రస్తుతం దేశంలో 20 కోట్ల మంది వాట్సాప్ యూజర్లు ఉండటంతో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పటికే వాట్సాప్ సేవలను ప్రారంభించాయి. పాలసీ కోసం వివిధ యాప్స్, బ్రౌజర్లు వెతకాల్సిన పనిలేదు. పైగా వాట్సాప్ ద్వారా 24 గంటలూ ఈ సంస్థలు కస్టమర్లకు అందుబాటులో ఉంటున్నాయి. లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రస్తుతం టూ వీలర్ వాహనాల రెనివల్ సర్వీసును అందిస్తున్నాయి. ప్రమాదానికి గురైన వాహనాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను వాట్సాప్ ద్వారా పంపే వీలు కల్పించనుంది. ఈ వాట్సాప్ సర్వీస్ తో బీమా నగదు వసూలు చేయడం వినియోగదారులకు సులువవుతుందని సంస్థ సీఈవో రూపమ్ ఆస్తానా చెప్పారు. 

 

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ మినిమమ్ ఇన్ఫర్మేషన్ ను వాట్సాప్ ద్వారా సేకరిస్తోంది. పాలసీ, కట్టాల్సిన మొత్తం, ఫండ్ విలువ, పన్ను సర్టిఫికెట్ల వంటి పలు సర్వీస్ లు వాట్సాప్ ద్వారా పొందవచ్చు. అంతేకాదు పేరు మార్పు, నామినీ మార్పు, పేమెంట్ మోడ్ మార్పులను కూడా వాట్సాప్ ద్వారా చేసుకునే అవకాశం ఉంది. అటు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైప్ ఇన్సూరెన్స్ అయితే కస్టమర్లు తమ జీవితకాల బీమా పాలసీలను వాట్సాప్ ద్వారా తెలుసుకునే వెసులుబాటును కూడా కల్పించింది. వాట్సాప్ ద్వారా సమాచారం పొందేందుకు అంగీకారం తెలిపిన కస్టమర్లు పాలసీ సర్టిఫికెట్లు, ప్రిమియం రిసీట్స్ , పన్ను సర్టిఫికెట్లు పొందేందుకు వీలుంటుంది అని సంస్థ డిప్యూటీ ఎండీ పునీత్ నందా వెల్లడించారు. 
 

ఇన్ఫర్మేషన్ అంతా సీక్రెట్..
వాట్సాప్ ఇన్ఫర్మేషన్ పై పలు అనుమానాలు కూడా ఉన్న క్రమంలో ఈ సర్వీస్ లో డేటా షేరింగ్ ఉండదని..అందుకే ఫుల్ సేఫ్టీ ఉంటుందని రూపమ్ ఆస్తానా తెలిపారు. కస్టమర్ డేటా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఉంటుంది. చాట్స్ అన్నీ కూడా వాట్సాప్ ద్వారా ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి. ఇందులో మూడో వ్యక్తి ప్రస్తావనే ఉండదనీ..వాట్సాప్ వెరిఫై చేసిన బిజినెస్ అకౌంట్ నుంచే కస్టమర్‌కు సమాచారం అందుతుందని ఆస్తాన తెలిపారు. 

  • సదరు కంపెనీ వాట్సాప్ నంబర్ తెలుసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఫండ్ వాల్యూ తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని టైప్ చేయాలి. అప్పుడు సంస్థ సదరు కస్టమర్ పాలసీ నంబర్ అడుగుతుంది..
  •  
  • పాలసీ నంబర్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. 
  • ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే సమాచారం వచ్చేస్తుంది. 
  • ఫండ్ వాల్యూ  తెలుసుకున్న అనంతరం మరింత ఇన్ఫర్మేషన్ కావాలా అనే విషయం ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకోవచ్చు..

Read Also:  వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక: మీ అకౌంట్ బ్లాక్ కాకూడదంటే..

Read Also:  డిజిటల్ రాజకీయం: ‘పొలిటికల్ యాడ్స్‌’పై ఫేస్‌బుక్ కొత్త టూల్

Read Also:  ఫీచర్స్ సూపర్ అంట : జియో 3 కమింగ్ సూన్

Read Also:  ఎంపీకే షాక్ : సీఎం రమేష్ వాట్సాప్ బ్యాన్