Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర వెళ్లేవారికి ఐఆర్సీటీసీ డిస్కౌంట్ ఆఫర్

"దేఖో అప్నా దేశ్" ఆఫర్‌లలో భాగంగా చార్ ధామ్ యాత్ర చేయాలనుకునే యాత్రికులకు IRCTC ప్రత్యేక ప్యాకేజి తీసుకువచ్చింది.

Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర వెళ్లేవారికి ఐఆర్సీటీసీ డిస్కౌంట్ ఆఫర్

Yatra

Char Dham Yatra: చార్ ధామ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు భారత రైల్వే సంస్థ అద్భుతమైన ఆఫర్స్ తీసుకొచ్చింది. “దేఖో అప్నా దేశ్” ఆఫర్‌లలో భాగంగా చార్ ధామ్ యాత్ర చేయాలనుకునే యాత్రికులకు IRCTC ప్రత్యేక ప్యాకేజి తీసుకువచ్చింది. ప్యాకేజీలో భాగంగా గ్రూప్ గా టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి రూ.58,900 (GSTతో కలిపి) ఒక్కొక్కరికి, అదే ఒంటరిగా బుక్ చేసుకుంటే రూ. 77,600లుగా టికెట్ ధరలు నిర్ణయించింది. మే 3 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభిస్తున్నట్లు ఇటీవల ఉత్తరాఖండ్ దేవాదాయశాఖ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు యాత్రకు వెళ్లే భక్తులను దృష్టిలో పెట్టుకుని ఐఆర్సీటీసీ ఈ ప్రత్యేక ప్యాకేజి తీసుకువచ్చింది. మొత్తం 11 రాత్రులు, 12 పగలుగా జరగనున్న ఈ ప్యాకేజీలో భాగంగా బద్రీనాథ్, బార్కోట్, గంగోత్రి, గుప్తకాశీ, హరిద్వార్, జానకీ చట్టి, కేదార్‌నాథ్, సోన్‌ప్రయాగ్, ఉత్తరకాశీ మరియు యమునోత్రి వంటి పుణ్యప్రాంతాలను సందర్శిస్తారు.

Also Read:Tina Dabi: ఐఏఎస్ టాపర్ టీనా దాబికి రెండో పెళ్లి.. మళ్లీ ఐఏఎస్‌తోనే

ప్యాకేజీలో టికెట్ బుక్ చేసుకున్న యాత్రికులు మే 14న నాగపూర్ నుంచి బయలుదేరి 25న తిరిగి చేరుకుంటారు. మొత్తం పర్యటన సమయంలో ప్రయాణికులకు ఉచిత అల్పాహారం మరియు రాత్రి భోజనం అందుబాటులో ఉంటుందని ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్యాకేజి బుక్ చేసుకున్న ప్రయాణికులు ముందుగా నాగపూర్ చేరుకుంటే..అక్కడి నుంచి ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో విమానం ద్వారా ఢిల్లీకి చేరుకుంటారు.

Also read:Bank Holidays April 2022 : ఏప్రిల్ నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు.. హాలిడేస్ లిస్ట్ ఇదే..

ఢిల్లీ నుంచి యాత్రికులు హరిద్వార్ చేరుకొని అనంతరం వరుసగా బార్కోట్, గంగోత్రి, గుప్తకాశీ, హరిద్వార్, జాంకీ చట్టి, కేదార్‌నాథ్, సోన్‌ప్రయాగ్, ఉత్తరకాశీ మరియు బద్రీనాథ్ చుట్టి వస్తారు. ప్రయాణికుల అవసరాన్ని భట్టి ప్రత్యేక బస్సు, కారు సౌకర్యం కూడా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. యాత్రికులు IRCTC వెబ్‌సైట్, www.irctctourism.com, ద్వారా ఆన్‌లైన్‌లోనూ అలాగే స్థానిక IRCTC టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు మరియు ప్రాంతీయ కార్యాలయాల వద్ద ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు పేర్కొన్నారు.