జల్లికట్టు గిన్నీస్ రికార్డు: ఇద్దరు మృతి

తమిళనాడు సాహాసక్రీడ జల్లికట్టు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించింది. ఆదివారం పుదుక్కోటై జిల్లా విరాళిమలై లోజరిగిన జల్లికట్టులో 1,354 ఎద్దులు, 424 మంది యువకులు పాల్గోన్నారు.

  • Published By: chvmurthy ,Published On : January 21, 2019 / 03:51 AM IST
జల్లికట్టు గిన్నీస్ రికార్డు: ఇద్దరు మృతి

తమిళనాడు సాహాసక్రీడ జల్లికట్టు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించింది. ఆదివారం పుదుక్కోటై జిల్లా విరాళిమలై లోజరిగిన జల్లికట్టులో 1,354 ఎద్దులు, 424 మంది యువకులు పాల్గోన్నారు.

చెన్నై: తమిళనాడులోని సాహాసక్రీడ  జల్లికట్టు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించింది. ఆదివారం  పుదుక్కోటై జిల్లా విరాళిమలై లో నిర్వహించిన జల్లికట్టుకు గిన్నీస్ ప్రతినిధులు హజరై క్రీడను తిలకించి నిర్వాహకులకు సర్టిఫికెట్ అందచేశారు. సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆదివారం ఉదయం పోటీలను ప్రారంభించారు.
గిన్నీస్ రికార్డు కోసం జల్లికట్టును పెద్ద ఎత్తుననిర్వహించాలని భావించినప్పటికీ కేవలం 1,354 ఎద్దులను మాత్రం రంగంలోకి దింపారు. అలాగే 424 మంది యువకులకు మాత్రమే ఎద్దులను అదుపుచేయటానికి అనుమతి ఇచ్చారు.  పోటీలో పాల్గేనే యువకులకు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజనకింద భీమా కల్పించారు.21 ఎద్దులను పట్టుకుని తిరుచ్చికి చెందిన మురుగానందం మొదటిస్థానంలో, పదహారు ఎద్దులను పట్టుకుని కాట్టురుకు చెందిన కార్తీ రెండో స్థానంలో నిలిచారు. 
విషాదం
గిన్నీస్‌ బుక్‌ రికార్డు కోసం అధికారులు ఏర్పాటు చేసిన అతిపెద్ద జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. జల్లికట్టులో ఎద్దులను అదుపు చేసే క్రమంలో ఇద్దరు మరణించగా, 41మంది గాయపడ్డారు, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.  కాగా జల్లికట్టులో పాల్గోన్న ఒక ఎద్దు పరుగులు తీస్తూ మైదానానికి బయట ఉన్న50 అడుగుల బావిలో పడిపోయింది. వెంటనే అక్కడే ఉన్న అగ్నిమాపకసిబ్బంది హుటాహుటిన ఆ ఎద్దును బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందింది.