Jharkhand : లాక్ డౌన్ పొడిగింపు..నిబంధనలు కొనసాగింపు

ఝార్ఖండ్ లో జులై 1 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు కూడా నో పర్మిషన్ అని ప్రకటించారు. షాపింగ్ మాల్స్, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌ను సాయంత్రం 4 గంటల వరకు తెరవడం సహా కొన్ని సడలింపులతో ఆంక్షలను జూన్ 24 వరకు జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని పొడిగిస్తూ జులై 1 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.

Jharkhand : లాక్ డౌన్ పొడిగింపు..నిబంధనలు కొనసాగింపు

Jharkhand Lockdown (1)

Jharkhand Lockdown: కరోనా సెకండ్ వేవ్ లో మరణాలు కలవర పెట్టేశాయి. తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. దేశ వ్యాప్తంగా సెకండ్ వేవ్ లో మరణాల సంఖ్య భారీగానే నమోదైంది. ఫస్ట్ కంటే సెకండ్ ఉదృతి బాగా ఉందనే విషయం అర్థం అయింది. కానీ థర్డ్ వేవ్ వస్తుందని ఇది సెకండ్ వేవ్ కంటే మరింత బలంగా ఉంటుందని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ సెకండ్ వేవ్ వ్యాప్తి సందర్భంగా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ లు ఇప్పుడిప్పుడే పలు రాష్ట్రాలు ఎత్తేస్తున్నాయి. నిపుణుల హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా అన్ లాక్ లు ప్రకటిస్తున్నాయి. కానీ మేం మాత్రం దానికి భిన్నం అంటోంది ఝార్ఖండ్ ప్రభుత్వం. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందికాబట్టి లాక్ డౌన్ ను పొడిగిస్తున్నామని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ప్రకటించారు.

థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో ఝార్ఖండ్ లో జులై 1 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది. అంతేకాదు సీఎం హేమంత్ సొరేన్
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు కూడా నో పర్మిషన్ అని ప్రకటించారు. దీంతో షాపింగ్ మాల్స్, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌ను సాయంత్రం 4 గంటల వరకు తెరవడం సహా కొన్ని సడలింపులతో కోవిడ్‌కు సంబంధించిన లాక్‌డౌన్ లాంటి ఆంక్షలను జూన్ 24 వరకు జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని పొడిగిస్తూ జులై 1 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.ఝార్ఖండ్ ప్రభుత్ం కరోనాను నియంత్రించటానికి ఏప్రిల్ 22న ఆ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కు సంబంధించి కఠిన నిబంధనలను ప్రారంభించింది. దీంట్లో భాగంగా లాక్ డౌన్ విధించింది. అప్పటి నుంచి వరుసగా ఏడు సార్లు లాక్ డౌన్ ను పొడిగిస్తూ వస్తోంది. తాజా లాక్ డౌన్ ఈరోజు (జూన్ 24,2021)తో ముగియనుంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే అంచనాల క్రమంలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను అనుమతించబోమని ఝార్ఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.అంతర్రాష్ట్ర ప్రయాణాలకు సంబంధించి ఈ-పాస్ ఉండాలని సూచించింది. ప్రార్థనా స్థలాలన్నీ మూసి ఉంచాలని ఆదేశించింది. సీఎం హేమంత్ సొరేన్ అధ్యక్షతన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ భేటీ అయింది. ఈ సమావేశంలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు.ఈ సందర్భంగా సీఎం హేమంత్ సొరేన్ మాట్లాడుతూ..ప్రజారోగ్యం కోసం లాక్ డౌన్ ను మరో వారం పాటు పొడిగిస్తున్నామని చెప్పారు. ప్రమాదకర పరిస్థితుల నుంచి రాష్ట్రం ఇంకా బయటపడలేదని… కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందనే అంచనాలున్నాయని అందుకే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్ ను పొడిగిస్తున్నామని తెలిపారు. కాగా థర్డ్ వేవ్ అంచనాలు నిజమైతే ఈ లాక్ డౌన్ ను మరోసారి పెంచే అవకాశాలున్నట్లుగా సమాచారం.

కాగా..బుధవారం (జూన్ 23,2021) జార్ఖండ్ లో COVID-19 సంఖ్య 3,44,775 కు పెరిగింది.110 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కరోనాతో మృతి చెందారు. దీంతో కరోనావైరస్ మరణాల సంఖ్య 5,102 కు చేరుకున్నాయి.ధన్‌బాద్‌లో అత్యధికంగా 17 కేసులు నమోదు కాగా..తూర్పు సింభూమ్ (14), రాంచీ (13) మరణాలు నమోదయ్యాయి. తూర్పు సింగ్భూమ్ మరియు గుమ్లా జిల్లాల్లో తాజా మరణాలు సంభవించాయి.