ట్రెండ్లీ : ఆ అమ్మవారికి నైవేద్యంగా పిజ్జా, బర్గర్,పానీపూరీ

  • Published By: veegamteam ,Published On : December 18, 2019 / 07:25 AM IST
ట్రెండ్లీ : ఆ అమ్మవారికి నైవేద్యంగా పిజ్జా, బర్గర్,పానీపూరీ

గుజరాత్ లోని ఓ అమ్మవారికి పెట్టే ప్రసాదాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. సాధారణంగా దేవాలయంలో అమ్మవారికైనా స్వామివారికైనా పులిహోర, లడ్డూ, దద్దోజనం, పరమాన్నం వంటివి నైవేద్యాలుగా పెడతారు. కానీ గుజరాత్‌లోని రాజ్ కోట్‌లో కొలువైన జీవంతికా అమ్మవారికి పిజ్జా, బర్గర్, పానీ పూరీ, శాండ్‌విచ్, చాక్లెట్స్, బిస్కెట్స్, క్రీమ్‌రోల్, కూల్‌డ్రింక్ వంటివి నైవేద్యంగా పెడతారు. వాటినే భక్తులకు ప్రసాదాలుగా పంచుతారు. దీంతో జీవంతికా అమ్మవారి దేవాలయం అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. ఎందుకుంటే అక్కడ వారికి ఇష్టమైన ప్రసాదాలుగా పెడతారు కాబట్టి. 

రాజ్‌పూత్‌పర్‌లో కొలువైన జీవంతికా అమ్మవారి దేవాలయానికి 51 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని అబేలాల్ దబే అనే వ్యక్తి తన రెక్కల కష్టంతో నిర్మించాడు. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా పూజారి ఎవరూ ఉండరు. ఎవరు పట్టికెళ్లిన నైవేద్యాలను అమ్మవారికి వారే స్వయంగా నివేదన చేయవచ్చు. అంతేకాదు జీవంతికా అమ్మవారి దేవాలయం సామాజిక కార్యక్రమాలకు స్థానికులు వినియోగిస్తుంటారు. అంతేకాదు ఈ ఆలయంలో హుండీలు కూడా ఉండవు. అయితే ఈ ఆలయంలో ఆహార పదార్థాలను తయారు చేసి స్కూల్ లోని చిన్నారులకు పంచుతుంటారు.  

భక్తులు ఈ అమ్మవారికి  విదేశాల నుంచి కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టటానికి ప్యాకెట్ల ద్వారా పిజ్జా, బర్గర్, శాండ్‌విచ్, చాక్లెట్స్, బిస్కెట్స్ పంపిస్తుంటారు. స్థానికులు..వ్యాపారులు జీవంతికా అమ్మవారికి ప్రతీ రోజూ పూజలు చేస్తుంటారు.