Karachi పేరు పెట్టుకోవద్దు..మార్చేయండి శివసేన నేత డిమాండ్

  • Published By: madhu ,Published On : November 20, 2020 / 01:37 AM IST
Karachi పేరు పెట్టుకోవద్దు..మార్చేయండి శివసేన నేత డిమాండ్

change the name ‘Karachi’ : కరాచీ పేరు పెట్టుకోవద్దు..తమకు ఇష్టం ఉండదు. టైం ఇస్తున్నాం..వెంటనే ఈ పేరును మార్చేయండి అంటూ..శివసేన నేత నితిన్ నంద్ గౌకర్..ఓ స్వీట్స్ యజమానిని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కరాచీ అనే పదాన్ని తాము ధ్వేషిస్తామని, ఇది పాకిస్తాన్ లో ఉగ్రవాదులకు చోటు కాబట్టి..పేరు మార్చాల్సి ఉంటుందని చెప్పారు. తన కుటుంబం కరాచీ నుంచి వలస వచ్చిందని స్వీట్ షాప్ యజమాని చెప్పారు.



మీ కుటుంబాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ దుకాణానికి కరాచీ అనే పేరు గాకుండా..మరాఠీలో ఏదైనా పేరు పెట్టుకోవాలని నితిన్ నంద్ గౌకర్ సూచించారు. ఇందుక సమయం ఇస్తున్నట్లు వెల్లడించారు. దీనిని శివసేన ప్రతినిధి సంజయ్ రౌత్ ఖండించారు. శివసేన యొక్క అధికారిక డిమాండ్ కాదని స్పష్టం చేశారు. కరాచీ బేకరీ, కరాచీ స్వీట్స్ ఎన్నో సంవత్సరాలుగా భారతదేశంలో ఎన్నో ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. వలస వచ్చిన వారు తమ వ్యాపారన్ని అభివృద్ధి చేస్తున్నారని, పేరు మార్చాలనే డిమాండ్ కు అర్థం లేదన్నారు.



గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. కరాచీ అనే పేరును తీసివేయాలని చాలా నగరాల్లో ఆందోళనలు నిర్వహించారు. ఉగ్రవాదులు పుల్వామాపై దాడి చేసిన అనంతరం బెంగళూరులో ఉన్న కరాచీ బేకరీ వద్ద కొందరు వ్యక్తులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.