Exit Poll Results: 2018లో కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ఎలా వచ్చాయి? చివరకు ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరగనుంది?

Exit Poll Results: ఇదే జరిగితే ఈ ప్రభావం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పడనుంది. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వస్తుంది.

Exit Poll Results: 2018లో కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ఎలా వచ్చాయి? చివరకు ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరగనుంది?

Karnataka exit polls

Exit Poll Results: దక్షిణాదిన కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Election 2023) బుధవారం జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ (Exit Poll Results) వచ్చాయి. కర్ణాటకలో మొత్తం అసెంబ్లీ సీట్లు 224. మ్యాజిక్ ఫిగర్ 113. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని పలు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి.

కర్ణాటకలో 2018 ఎన్నికలు మే 12న జరిగాయి. ఆ రోజున పోలింగ్ ముగియగానే పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఆ సమయంలో దేశంలోని ప్రధాన 8 ఎగ్జిట్ పోల్స్ సంస్థల్లో 6 సంస్థలు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాల్లో గెలుస్తుందని చెప్పాయి. అలాగే, 8 ఎగ్జిట్ పోల్స్ సంస్థల్లో ఏడు సంస్థలు హంగ్ ఏర్పడుతుందని పేర్కొన్నాయి. జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని చెప్పాయి.

అప్పట్లో తాము కింగ్ మేకర్ కామని, కింగే అవుతామని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి కూడా అన్నారు. ఆ పార్టీకి 20 నుంచి 40 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు చెప్పాయి. బీజేపీకి 120 సీట్లు వస్తాయని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఓ సంస్థ తెలిపింది.

2018లో ఏయే సంస్థ ఎలా అంచనా వేసింది?

Exit Poll Results 2018

Exit Poll Results 2018

పైన టేబుల్ లో పేర్కొన్నట్లు ఆయా సంస్థలు అంచనా వేశాయి. ఆ ఎన్నికల్లో చివరకు, బీజేపీ 104, కాంగ్రెస్ 80, జేడీఎస్ 37, స్వతంత్ర అభ్యర్థి, బీజేఎస్పీ, కేపీజేపీకి ఒక్కో సీటు దక్కాయి. గత ఎన్నికల్లో ఏడు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్లు హంగ్ ఏర్పడింది. జేడీఎస్-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అనంతరం, ఆ ప్రభుత్వం కుప్పకూలి బీజేపీ సర్కారు ఏర్పడిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఏం చెబుతున్నాయి?
మొత్తం 8 ప్రధాన ఎగ్జిట్ పోల్స్ సంస్థల్లో 4 సంస్థలు కాంగ్రెస్ కి పూర్తి మెజార్టీ (113 లేదా 112 సీట్లు) రావచ్చని చెబుతున్నాయి. ఓ సంస్థ మాత్రం బీజేపీకి 113 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మిగతా సంస్థలు హంగ్ ఏర్పడుతుందని అంటున్నాయి. అలాగే, బీజేపీ కన్నా కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నాయి.

ఈ సారి కూడా మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సంస్థల అంచనాలు నిజమైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ ప్రభావం ఈ ఏడాది జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పడనుంది. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వస్తుంది.

Exit Poll Results: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు నిజమవుతాయా? గతంలో అనేక సార్లు ఘోరంగా విఫలం.. ఎప్పుడెప్పుడంటే?