దళితులకు హెయిర్‌ కట్‌ చేసాడని బార్బర్ కుటుంబాన్ని వెలివేసి..రూ.50వేలు జరిమానా

  • Published By: nagamani ,Published On : November 20, 2020 / 02:02 PM IST
దళితులకు హెయిర్‌ కట్‌ చేసాడని బార్బర్ కుటుంబాన్ని వెలివేసి..రూ.50వేలు జరిమానా

karnataka : Mysuru barber Rs 50,000 fine for hair cut SC-ST communities : చదువులో టెక్నాలజీల్లో ముందుకెళుతున్న ఈ కాలంలో కూడా కులాలు..మతాలు అంటూ పాకులాడుతూ అనాగరికంగా దిగజారిపోతున్న జనాలకు ఏనాటికి మనుష్యులంతా సమానమని తెలుసుకుంటారోఅర్థం కావట్లేదు. కులం పేరుతో జరుగుతున్న దారుణాలకు మరో ఉదాహరణ కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. దళితులకు హెయిర్ కట్టింగ్ చేశాడని ఓ బార్బర్ కుటుంబాన్ని గ్రామస్తులు వెలివేశారు. మీ కుటుంబాన్ని సామాజికంగా వెలివేస్తున్నామని తీర్పునిచ్చారు గ్రామపెద్దలు. అంతేకాదు రూ.50వేలు జరిమానా విధించారు. కంప్యూటర్ యుగంలో కులం పేరుతో ఓ బార్బర్ కుటుంబాన్ని వెలివేసిన ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని నంజనాగుడు తాలూకాలోని హల్లారే గ్రామంలో జరిగింది.



కరోనా మహమ్మారితో వచ్చిన లాక్ డౌన్ తో అన్ని ఉపాధులు దెబ్బతిన్నాయి. చేతిపనులు సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇప్పుడిప్పుడే పనుల్లో పడుతున్నారు. తమ పనులు చేసుకుంటు కుటుంబాన్ని పోషించుకునే క్రమంలో ఓ బార్బర్ కుటుంబాన్ని అమానుషంగా వెలివేశారు గ్రామ పెద్దలు.


వివరాల్లోకి వెళితే..కరోనా వచ్చిన లాక్ డౌన్ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కుటుంబాల్లో ఒకటి కర్ణాటకలోని హల్లారే గ్రామానికి చెందిన మల్లిఖార్జున​ శెట్టి కుటుంబం.
మల్లిఖార్జున బార్బర్ పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈక్రమంలో తన షాపుకు హెయిర్ కట్టింగ్ చేయాలని వచ్చిన SC, ST సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు మల్లిఖార్జున హెయిర్‌ కట్‌ చేశాడు.ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘‘అటువంటివాళ్లను ముట్టుకుని వాళ్లకు హెయిర్ కటింగ్ చేశావు..వాళ్లిచ్చిన డబ్బులు తీసుకున్నావు. ఆ డబ్బులతో నువ్వు బతకాలా? లేకపోతే బతకలేవా? దళితుల చేతుల కింద చేతులు పెట్టి డబ్బులు తీసుకుని బతకాలా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు.ఇకనుంచి గ్రామంలో ఉండటానికి వీల్లేదనీ మా పరువు తీశావంటూ దూషించారు. ఇకనువ్వు మా సామాజిక వర్గంలోని మనుషులతో కలవటానికి వీల్లేదు..మీరెవ్వరూ మా ఇళ్లకు రావద్దు..మేం ఎవ్వరం మీ ఇంటి గడపకూడా తొక్కం’’ అంటూ దీనికి పరిహారంగా రూ.50 వేలు కట్టాలని ఆదేశించారు.



ఈ దారుణంపై మల్లిఖార్జున తల్లడిల్లిపోయాడు. అసలే పనులు లేక కష్టాల్లో పడిన నేను రూ.50వేలు ఎలా కట్టాలని వాపోతున్నాడు. గతంలో కూడా తాను రెండుసార్లు కుల వివక్షకు గురయ్యామని జరిమానా కూడా చెల్లించామని ఇలా తమ కుటుంబాన్ని తరచూ గ్రామ పెద్దలు జరిమానాలు కట్టాలని వేధిస్తున్నాడని వాపోయాడు.బార్బర్‌ మాల్లికార్జున​ ఆవేదన వ్యక్తం చేశాడు.నా షాకు వచ్చినవాళ్లు ఏకులం వాళ్లు అని తెలుసుకుని నా పని చేసుకుంటే నా పని ఎలా నడుస్తుంది? నాకుటుంబం ఎలా బతకాలి అంటే వాపోయాడు. అలాగే తన షాపుకు చన్నా నాయక్‌ వంటి తదితర దళితులు వస్తే వాళ్లకు ఎ‍క్కువ చార్జ్‌ వసూలు చేయాలని గతంలో తనను గ్రామ పెద్దలు ఆదేశించారని మల్లిఖార్జున తెలిపాడు.



దానికి తాము ఒప్పుకోలేదని ఎవ్వరికైనా ఒకే ఖరీదుతో హెయిర్ కట్టింగ్ చేస్తానని చెప్పటంతో ఆగ్రహం చెందిన గ్రామ పెద్దలు తన కొడుకుని తీవ్రంగా కొట్టి…నా కొడుకుని బెదిరించి బలవంతంగా 5 వేల రూపాయలను లాక్కుపోయారని తెలిపాడు.దళితుడికి హెయిర్‌ కట్‌ చేయడం నేరం ఎలా అవుతుందని మల్లికార్జున ప్రశ్నించాడు. తన చేసే పనికి అందరకీ సమానవేమనని..దళితుల నుంచి ఎక్కువ డబ్బు తీసుకుంటే తాను చేసింది తప్పు అవ్వదా? అని ప్రశ్నించాడు.



ఇలా తరచూ గ్రామ పెద్దలు చేసే వేధింపులు భరించలేకపోతున్నానని కష్టపడి సంపాదించిన డబ్బుల్ని కుటుంబ కోసం కాకుండా జరిమానాలు కట్టటానికే సరిపోతున్నాయనీ ఇక గ్రామ పెద్దల వేధింపులు భరించలేనని అధికారులకు పిర్యాదు చేశామని తెలిపాడు మల్లిఖార్జున. ఈ హింస ఆపకపోతే, తమకు న్యాయం జరగకపోతే తన కుటుంబం అంతా ఆత్మహత్యే శరణ్యమని కన్నీటితో తెలిపాడు మల్లిఖార్జున.


మల్లిఖార్జున ఘటనపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆధునిక నాగరిక సమాజంలో జాతి, కుల, మతం అటూ విద్వేషాన్ని వెళ్లగక్కడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని అప్పుడే వాటికి ఫుల్ స్టాప్ పడుతుందని డిమాండ్ చేశారు. ఈ కాలంలో కూడా ఇంకా దళితులు, అంటరాని వారు అంటూ వివక్ష, సంఘ బహిష్కారం లాంటి ఘటనలు అమానవీయమైవనవీ, అధికారులు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి.