Karnataka Elections 2023 : కాంగ్రెస్ నేతలు అంబులెన్సులు దగ్గర ఉంచుకుంటే బెటర్ : బీజేపీ నేత సెటైర్లు

ఎగ్జిట్ పోల్స్‌ నిజమైన ఫలితాలు కావు..వాటిపై మీరు ఆశలు పెట్టుకోవద్దు ఎందుకైనా మంచిది అంబులెన్స్ లు రెడీగా పెట్టుకోండి అంటూ సెటైర్లు వేశారు.

Karnataka Elections 2023 : కాంగ్రెస్ నేతలు అంబులెన్సులు దగ్గర ఉంచుకుంటే బెటర్ : బీజేపీ నేత సెటైర్లు

Karnataka Elections 2023

Karnataka Elections 2023 : కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్ (Congress)కే మెజారిటీ వస్తుందని కాంగ్రెస్సే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనాలు వెల్లడయ్యాయి. రాజకీయ విశ్లేషకులు కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందనే అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. కానీ బీజేపీ (BJP) మాత్రం అవి కేవలం వట్టిమాటలేనని ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమేనంటోంది. అంతేకాదు కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలపై సెటైర్లు కూడా వేస్తోంది బీజేపీ. దీంట్లో భాగంగానే బీజేపీ నేత అమిత్ మాలవీయ (Amit Malviya)మాట్లాడుతు..ఎగ్జిట్ పోల్స్‌.. (Exit Polls) నిజమైన ఫలితాలు కావు..వాటిపై మీరు ఆశలు పెట్టుకోవద్దు ఎందుకైనా మంచిది అంబులెన్స్ (ambulance)లు రెడీగా పెట్టుకోండి అంటూ సెటైర్లు వేశారు. 13వరకు వేచి చూడండీ అంటూ తమ గెలుపుపై ధీమా వ్యక్తంచేశారు అమిత్ మాలవీయ.

మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా గెలుపుపై అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ధీమా వ్యక్తంచేస్తున్నాయి. అలాగే జేడీఎస్ పూర్తి స్థాయిపై ఆశలు పెట్టుకోకపోయినా కింగ్ మేకర్ మాత్రమే తామేనంటోంది. కానీ కర్ణాటక(Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. పోటా పోటీగా మ్యానిఫెస్టోలో వరాల జల్లు కురిపించాయి. ఉచితాలు మంచిది కాదంటునే బీజేపీ కూడా ఉచితాల జల్లు కురిపించింది.

బుధవారం (మే 10,2023)ఓటింగ్ జరగ్గా.. సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్(Exit Polls)అంచనాలు విడుదలయ్యాయి. కాంగ్రెస్‌కే స్వల్ప మొగ్గుందని అంచనాలు పేర్కొనగా బీజేపీ మాత్రం గెలుపు తమదేనంటోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో కాంగ్రెస్ శ్రేణులు ధిట్ ఖుష్ అవుతున్నారు. కాంగ్రెస్ ఆనందంపై నీళ్లు చల్లుతు బీజేపీ నేత అమిత్ మాలవీయ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎందుకైనా మంచిది కాంగ్రెస్ అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ‘ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్(Congress) గెలుపుపై ఆశ పెట్టుకున్న వారి సంబరాలు చూస్తుంటే సరదాగా ఉందని..అవి ఎగ్జిట్ పోల్స్‌.. నిజమైన ఫలితాలు కావంటూ కాంగ్రెస్ శ్రేణులకు నాదో సలహా.. ఎందుకైనా మంచిది మీరు అంబులెన్సులు దగ్గర ఉంచుకోండి. ఫలితాలు తారుమారు కావడానికే ఎక్కువ అవకాశం ఉంది. ఆ సమయంలో అంబులెన్సులు ఉపయోగపడతాయి’ అంటూ సెటైర్లు వేశారు.

కాగా..ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల గురించి కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై కొట్టిపారేశారు. పూర్తి గ్రౌండ్ రిపోర్టు బీజేపీకి స్పష్టమైన మెజారిటీనిచ్చిందని అన్నారు. మెజారిటీ 100 శాతం మాదేనని ధీమా వ్యక్తంచేశారు. మరోవైపు జాతీయ, కర్ణాటక మీడియా సంస్థలు చేపట్టిన పోల్స్‌లో మెజారిటీగానీ, అత్యధిక స్థానాలుగానీ కాంగ్రెస్‌ సాధించే అవకాశముందని వెల్లడించాయి. కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌లో హంగ్‌కూ అవకాశముందని తేలింది. మరి ఎవరి ఆశలు నిజమవుతాయో..ఎవరి ఆకాంక్షలు అడియాశలు అవుతాయో వేచి చూడాలి..