Wedding Photo Shoot: వధువు వినూత్న ఆలోచన.. గుంతల రహదారిపై కేరళ వధువు ఫొటోషూట్.. వీడియో వైరల్..

గుంతలతో నిండిన రోడ్డుపై కేరళకు చెందిన ఓ వధువు తన వివాహ ఫోటోషూట్‌ను చిత్రీకరించింది. షూట్ వీడియో రోజువారీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హైలైట్ చేసింది. వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Wedding Photo Shoot: వధువు వినూత్న ఆలోచన.. గుంతల రహదారిపై కేరళ వధువు ఫొటోషూట్.. వీడియో వైరల్..

Kerala bride photoshoot

Wedding Photo Shoot: గుంతలతో నిండిన రోడ్డుపై కేరళకు చెందిన ఓ వధువు తన వివాహ ఫోటోషూట్‌ను చిత్రీకరించింది. షూట్ వీడియో రోజువారీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హైలైట్ చేసింది. వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొద్దిగంటల్లోనే 4.3 మిలియన్ల మంది వీక్షించారు. 3,70,400 మంది లైకులు చేశారు.

Viral Video: ప్రియుడితో స్కూటీపై షికారుకెళ్లిన భార్య.. చేజ్ చేసి చితకబాదిన భర్త.. వీడియో వైరల్

నేటి రోజుల్లో వివాహం అంటే ముందు ఫొటోషూట్ గుర్తుకు వస్తుంది. పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఆకర్షణీయమైన ప్రదేశాల్లో ఫొటో షూట్ చేయించుకుంటారు. కానీ కేరళకు చెందిన ఓ వధువు మాత్రం వినూత్నరీతిలో ఆలోచించింది. సామాజిక బాధ్యతకు పెద్దపీట వేస్తూ తమ ప్రాంతంలోని రహదారుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు గుంతల రోడ్డు మధ్యలో ఫొటో షూట్ తీసుకుంది. తన వివాహ ఫొటో షూట్ కార్యక్రమంలో భాగంగా పెళ్లికుమార్తెలా ముస్తాబై, బంగారు నగలు ధరించి గుంతలు, వర్షపు నీటితో మడుగులా మారిన రోడ్డుపై నడుస్తూ వధువు ఫొటోలు దిగింది. వాటిని చూసైనా ప్రభుత్వం స్పందించాలన్న ఆమె కోరిక మేరకు ఆ ఫొటోలను, వీడియోను యారో వెడ్డింగ్ కంపెనీ సెప్టెంబర్ 11న తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దానికి “మార్గమధ్యలో పెళ్లి ఫోటోషూట్” అని క్యాప్షన్ ఇచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by arrow_weddingcompany™ (@arrow_weddingcompany)

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతున్న వధువు వివరాలు ఏమీ తెలియనప్పటికీ.. నెటిజన్లు ఆమె చర్య పట్ల ప్రశంసిస్తున్నారు. ఓ నెటిజన్.. రోడ్డుపై కాదు.. చెరువులో అని రాసి రోడ్డు పరిస్థితిని చూసి నవ్వుతున్న ఫొటో పెట్టాడు. మరో నెటిజన్ మంచి రహదారి అని వ్యాఖ్యానించాడు. మరో నెటిజన్ “అది రోడ్డునా.. కొన్ని చేప పిల్లలను కొంటే చేపల పెంపకం ప్రారంభించవచ్చు” అంటూ పేర్కొన్నాడు.