దేశంలోనే ఫస్ట్ : ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, హాజరుకి ఆధార్ లింక్

రాష్ట్ర ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆధార్ ఆధారిత హాజరు తప్పనిసరి చేసింది.

  • Published By: sreehari ,Published On : May 14, 2019 / 08:51 AM IST
దేశంలోనే ఫస్ట్ : ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, హాజరుకి ఆధార్ లింక్

రాష్ట్ర ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆధార్ ఆధారిత హాజరు తప్పనిసరి చేసింది.

కేరళ రాష్ట్ర లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (LDF)ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆధార్ ఆధారిత హాజరు తప్పనిసరి చేసింది. ఇకపై ప్రభుత్వ అధికారులు నెలజీతం తీసుకోవాలంటే.. ఆధార్ నెంబర్ లింక్ ఉండాల్సిందే. ఆరునెలల్లోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అంటెండెన్స్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నారు.

దీనికి సంబంధించి మే 6, 2019న కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర సెక్రటేరియట్ నుంచి ప్రభుత్వ స్కూళ్ల సిబ్బంది వరకు మొత్తం 5లక్షల 60వేల మంది అధికారుల వరకు అందరూ నెలజీతం అందుకోవాలంటే.. ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆదేశాల ప్రకారం.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, విద్యాకేంద్రాల్లో ఉద్యోగుల జీతాలను స్పార్క్ (సర్వీసు అండ్ పేరోల్ అడ్మినిస్ట్రేటీవ్ రీపొసిటరీ ఫర్ కేరళ) ఆధార్ బేసిడ్ బయోమెట్రిక్ పంచింగ్ సిస్టమ్ తో అనుసంధానం చేయనున్నారు. 

ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది పనితీరును మెరుగుపర్చేందుకు ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నెలజీతం, హాజరుకు ఆధార్ ప్రక్రియతో లింక్ చేసిన రాష్ట్రంగా దేశంలోనే కేరళ ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెడుతోంది. నేషనల్ ఇన్ఫోమాటిక్స్ సెంటర్ (NIC) ఈ బయోమెట్రిక్ మిషన్లకు సంబంధించిన సాఫ్ట్ వేర్ ను అందిస్తోంది.  ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ కెల్ట్రాన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల ఫింగర్ ఫ్రింట్లను రికార్డు చేసేందుకు ఈ బయోమెట్రిక్ మిషన్లను కొనుగోలు చేయనున్నారు.

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకసారి ఈ మిషన్లు ఇన్ స్టాల్ చేశాక కెల్ట్రాన్.. ప్రతిజిల్లా కార్యాలయాల్లో తమ ట్రైనర్లను నియమించనుంది. స్పార్క్ సిస్టమ్ ఆధారంగా ఫంక్షన్ చేయడం కుదరకపోతే.. గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్ (GeM)అంటెండెన్స్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా బయోమెట్రిక్ మిషన్లను సేకరించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సచివాలయం కూడా పంచింగ్ సిస్టమ్ ను జనవరి 1, 2018 నుంచి అందరి ఉద్యోగులకు తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. 

ఆర్థికపరంగా పినరయి విజయన్ ప్రభుత్వానికి ఈ పంచింగ్ సిస్టమ్ కాస్త భారంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం.. UIDAI.. ఒక్కో ఈ-కేవైసీ అథెంటికేషన్ కు రూ.20 వరకు ఛార్జ్ చేస్తోంది. ప్రతి Yes లేదా No అథెంటికేషన్ కోసం రూ.50పైసలు ఛార్జ్ చేస్తోందని డిజిటల్ రైట్స్ యాక్టివిస్ట్ అన్వీర్ అరవింద్ తెలిపారు. E-KYC లేకుండా కేరళ.. ప్రతిరోజు రూ.5.6 లక్షలు ఖర్చు చేస్తుండగా.. ప్రభుత్వ అధికారులు రోజులో రెండుసార్లు పంచ్ చేయాల్సిన అవసరం ఉంది.

ఈ విధానంపై కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇస్సాక్ నుంచి ఎలాంటి స్పందన లేదు. పంచింగ్ విధానం.. అమలు చేయడం ఆర్థికపరంగా సాధ్యంకానిదని.. పేరు చెప్పేందుకు అంగీకరించని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇప్పటివరకూ ఆర్థిక మంత్రితో ఎలాంటి చర్చ జరగలేదని, కేబినెట్ నిర్ణయం కూడా కాదని ఆయన అన్నారు.