SBI Farmers : రైతులకు గుడ్‌న్యూస్, ఇకపై బ్యాంక్‌కి వెళ్లక్కర్లేదు

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రైతులకు శుభవార్త చెప్పింది. వారి కోసం కొత్త సర్వీస్ అందుబాటులోకి తెచ్చింది. రైతులు ఇకపై కిసాన్ క్రెడిట్ కార్డు రివ్యూ కోసం

SBI Farmers : రైతులకు గుడ్‌న్యూస్, ఇకపై బ్యాంక్‌కి వెళ్లక్కర్లేదు

Sbi Farmers

SBI Farmers : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రైతులకు శుభవార్త చెప్పింది. వారి కోసం కొత్త సర్వీస్ అందుబాటులోకి తెచ్చింది. రైతులు ఇకపై కిసాన్ క్రెడిట్ కార్డు రివ్యూ కోసం బ్యాంకుకి వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లో నుంచే ఆ పని పూర్తి చేసుకోవచ్చు.

ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా రైతులు వారి కిసాన్ క్రెడిట్ కార్డు అకౌంట్ వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం యోనో యాప్‌లో క్రిషి అనే ఆప్షన్ ను ఎస్బీఐ తీసుకొచ్చింది. దీని ద్వారా రైతులు ఈ సేవలు పొందొచ్చు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఎస్బీఐ తెలిపింది. బ్యాంకుకి వెళ్లే పని లేకుండా తమ కస్టమర్ల సౌలభ్యం కోసం ఎస్బీఐ యోనో యాప్ తెచ్చింది. దీని ద్వారా పలు రకాల సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే.

రైతులకు సులభంగానే రుణాలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కేసీసీ స్కీమ్ తీసుకొచ్చింది. ఇక పీఎం కిసాన్ లో ఉండే లబ్దిదారులు ప్రతీ ఒక్కరు కేసీసీ స్కీమ్ దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో రైతులకు తక్కువ వడ్డీకే రూ.3లక్షల వరకు లోన్ లభిస్తుంది.