Opposition Letter PM Modi : కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మనీశ్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ.. ప్రధాని మోదీకి విపక్షాలు లేఖ

మనీశ్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ ప్రధాని మోదీకి విపక్షాలు లేఖ రాశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తోపాటు మాజీ సీఎంలు ఉద్ధవ్ ఠాక్రే, ఫారూఖ్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, బీహార్ మంత్రి తేజస్వీ యాదవ్, శరద్ పవార్ లు ప్రధాని మోదీకి లేఖ రాశారు.

Opposition Letter PM Modi : కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మనీశ్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ.. ప్రధాని మోదీకి విపక్షాలు లేఖ

LETTER

Opposition Letter PM Modi : కేంద్ర దర్యాప్తు సంస్థలు, గవర్నర్ వ్యవస్థల దుర్వినియోగం, మనీశ్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ ప్రధాని మోదీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు సంయుక్త లేఖ రాశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తోపాటు మాజీ సీఎంలు ఉద్ధవ్ ఠాక్రే, ఫారూఖ్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, బీహార్ మంత్రి తేజస్వీ యాదవ్, శరద్ పవార్ లు ప్రధాని మోదీకి లేఖ రాశారు. జాతీయ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. మనీశ్ సిసోడియా అరెస్టును తీవ్రంగా ఖండించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం అవుతున్నాయంటూ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ప్రధానికి లేఖ రాసిన వాటిలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్జేడీ, జేకేఎన్ సీ, ఎన్ సీపీ, యూపీటీ, సమాజ్ వాదీ పార్టీలు ఉన్నాయి. భారత్ ను ప్రజాస్వామ్య దేశంగా తాము నమ్ముతున్నామని తెలిపారు. ప్రతిపక్షాల ప్రతినిధులపై జాతీయ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని.. ఇది ప్రజాస్వామ్యంలో సరైంది కాదంటూ లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా మనీశ్  సిసోడియా లాంటి నేత ఢిల్లీలో పేరు పొందారు, ప్రపంచస్థాయిలో గుర్తింపు ఉన్న నేత పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Manish Sisodia Custody : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు

కొన్ని ఆరోపణలతో సీబీఐ చేత అరెస్టు చేయించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని లేఖలో వెల్లడించారు. ఇది రాజకీయ కుట్రగా పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఇలాంటి చర్యలు తగవు అంటూ హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విధానాలు అనుసరించకూడదని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీశ్ సిసోడియాను గత కొంతకాలంగా సీబీఐ విచారిస్తోంది. ఎట్టకేలకు శుక్రవారం సిసోడియాను అరెస్టు చేసింది.

కేంద్ర దర్యాప్తు సంస్థలు, గవర్నర్ వ్యవస్థల దుర్వినియోగంపై ప్రధాని మోదీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతల సంయుక్త లేఖ రాశారు. ప్రధానికి లేఖ రాసిన కె. చంద్రశేఖర రావు (BRS), మమతా బెనర్జీ (AITC), అరవింద్ కేజ్రీవాల్ (AAP), భగవంత్ మాన్ (AAP), తేజస్వి యాదవ్ (RJD), ఫరూక్ అబ్దుల్లా (JKNC), శరద్ పవార్ (NCP), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన, UBT), అఖిలేష్ యాదవ్ (SP) గవర్నర్, కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయంగా దుర్వినియోగం చేయడం మన ప్రజాస్వామ్యానికి మంచిదికాదని..దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

Manish Sisodia: పదవులకు రాజీనామా చేసిన మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్.. ఆమోదించిన సీఎం కేజ్రీవాల్

ప్రతిపక్ష సభ్యులపై కేంద్ర సంస్థల దుర్వినియోగం మనం ప్రజాస్వామ్యం నుండి నిరంకుశ పాలనకు మారినట్లు సూచిస్తోందన్నారు. నిరంకుశ బీజేపీ పాలనలో భారతదేశం యొక్క ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు. 2014 నుంచి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తున్న తీరుతో ప్రజల్లో వాటి ప్రతిష్ట దిగజారిందన్నారు. దర్యాప్తు సంస్థల స్వయం ప్రతిపత్తి, నిష్పాక్షికత గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలిపారు. కేంద్ర సంస్థలపై భారత ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టమే అత్యున్నతమైనదన్నారు.

బీజేపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్న పార్టీకి అనుకూలంగా ప్రజలు ఇచ్చిన ఆదేశాన్ని గౌరవించాలని సూచించారు. దేశవ్యాప్తంగా గవర్నర్ల కార్యాలయాలు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర పాలనకు విఘాతం కలిగిస్తున్నాయని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తెలంగాణ, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌లు బీజేపీయేతర ప్రభుత్వాలు నడుపుతున్న రాష్ట్రాల మధ్య విస్తృతమైన విభేదాలకు దారితీసేలా మారారని పేర్కొన్నారు. గవర్నర్ లు రాజ్యాంగ స్ఫూర్తికి ముప్పు కలిగిస్తున్నారని వెల్లడించారు.

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఫిబ్రవరి 26న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సీబీఐ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా అక్రమాలకు సంబంధించి అరెస్టు చేసిందని తెలిపారు. సిసోడియాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, రాజకీయ కుట్రతో కూడినవని చెప్పారు. సిసోడియా అరెస్ట్ దేశవ్యాప్తంగా ప్రజలను ఆగ్రహానికి గురి చేసిందన్నారు. ఢిల్లీ పాఠశాల విద్యను మార్చినందుకు మనీశ్ సిసోడియా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. సిసోడియా అరెస్టు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ కక్షసాధింపుకి ఉదాహరణగా పేర్కొనబడుతుందన్నారు. 2014 నుంచి బీజేపీ పాలనలో దర్యాప్తు సంస్థలచే బుక్ చేయబడిన, అరెస్టు చేయబడిన, దాడి చేయబడిన లేదా విచారించిన మొత్తం కీలక రాజకీయ నాయకులలో గరిష్టంగా ప్రతిపక్షానికి చెందిన వారే ఉన్నారని గుర్తు చేశారు.

బీజేపీలో చేరిన ప్రతిపక్ష రాజకీయ నాయకులపై కేసులపై దర్యాప్తు సంస్థలు నెమ్మదిగా ఉన్నాయని పేర్కొన్నారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణంపై 2014 -2015లో కాంగ్రెస్ మాజీ సభ్యుడు, ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి (సిఎం) హిమంత బిశ్వ శర్మపై సీబీఐ, ఈడీ విచారణ జరిపాయని.. హిమంత బిశ్వ శర్మ బీజేపీలో చేరిన తర్వాత కేసు పురోగతి సాధించలేదన్నారు. TMC మాజీ నాయకులు సువేందు అధికారి, ముకుల్ రాయ్ నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో ED, CBI స్కానర్‌లో ఉన్నారని.. వారు బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన తర్వాత కేసులు పురోగతి సాధించలేదని పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన నారాయణ్ రాణేతో సహా అనేక ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు.

AAP Protests : మనీష్ సిసోడియా అరెస్ట్ కు వ్యతిరేకంగా ఆప్ నిరసనలు.. బీజేపీ కార్యాలయాల ముట్టడికి యత్నం

2014 నుంచి ప్రతిపక్ష నేతలపై దాడులు, కేసులు, అరెస్టు చేయడం గణనీయంగా పెరిగాయని వెల్లడించారు. లాలూ ప్రసాద్ యాదవ్ (రాష్ట్రీయ జనతా దళ్), సంజయ్ రౌత్ (శివసేన), ఆజం ఖాన్ (సమాజ్‌వాదీ పార్టీ), నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్ (ఎన్‌సిపి), అభిషేక్ బెనర్జీ (టిఎంసి) నేతలు దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే అనుమానాన్ని రేకెత్తిస్తాయని తెలిపారు. ప్రతిపక్ష నేతలపై నమోదైన కేసులు, అరెస్టుల సమయాలు ఎన్నికలతో సమానంగా..రాజకీయ ప్రేరేపితమైనవి అని స్పష్టంగా తెలుస్తుందన్నారు.

ప్రతిపక్ష సభ్యులను లక్ష్యంగా చేసుకున్న తీరు బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందన్న ఆరోపణకు బలం చేకూరుస్తోందని చెప్పారు. ఈడి సహా అనేక దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగపరుస్తుందని విమర్శించారు. SBI, LIC తమ షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ. 78,000 కోట్లకు పైగా ఒక నిర్దిష్ట సంస్థకు కేటాయించడం వల్ల నష్టపోయినట్లు అంతర్జాతీయ ఆర్థిక నివేదిక వచ్చినప్పటికీ ప్రజాధనం ప్రమాదంలో ఉన్నప్పటికీ సదరు సంస్థ ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయడానికి కేంద్ర ఏజెన్సీలను ఎందుకు అదేశించలేదని ప్రశ్నించారు.

CM KCR : మనీశ్ సిసోడియా అరెస్ట్‌, నెక్ట్స్ ఎవరు?-సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్

మన దేశ ఫెడరలిజానికి వ్యతిరేకంగా యుద్ధం జరుగుతున్న మరో ఫ్రంట్ ఉన్నట్లు కనిపిస్తోందని ప్రధానికి రాసిన సంయుక్త లేఖలో ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు. సిసోడియా అరెస్టు అనంతర పరిణామాలపై ప్రతి రోజూ అన్ని రాష్ట్రాల ప్రతిపక్షాల నేతలంతా స్పందిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంప్రదింపులు జరుపుకున్న తర్వాత లేఖ రాయాలని నిర్ణయించుకున్నాక ప్రధానికి ఈ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కుట్రలకు తెరలేపుతుందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకునే లేఖ రాసినట్లు తెలుస్తోంది.