Love You Zindagi : కరోనాతో పోరాడుతూ..ధైర్య యువతి కన్నుమూసింది

ముక్కుకు ఆక్సిజన్ పైపు, చేతికి సైలెన్ ఉన్న ఓ యువతి ..లవ్ యు జిందగీ పాట వింటూ..ఎంజాయ చేస్తున్న యువతి వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Love You Zindagi : కరోనాతో పోరాడుతూ..ధైర్య యువతి కన్నుమూసింది

Corona

Covid 19 Patient Dies : ముక్కుకు ఆక్సిజన్ పైపు, చేతికి సైలెన్ ఉన్న ఓ యువతి ..లవ్ యు జిందగీ పాట వింటూ..ఎంజాయ చేస్తున్న యువతి వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాధి సోకినా..ఎంతో ధైర్యంగా కనిపించిన ఆ యువతి ప్రస్తుతం మనమధ్య లేరు. కరోనా కాటుకు బలైపోయిన వారిలో ఒకరిగా మారిపోయింది.

ఆమె తుదిశ్వాస విడిచిందని ఢిల్లీకి చెందిన వైద్యురాలు Dr.Monika Langeh?? ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడంతో నెటిజన్లు బాధతృప్త హృదయాలతో శ్రద్ధాంజలి ఘటించారు. క్షణాల్లో తెగ వైరల్ గా మారిపోయింది. ఆమె బతికి ఉన్న ఈ వీడియోను చాలా మంది రీ ట్వీట్ చేస్తున్నారు.

ఓ అమ్మాయి కరోనా వ్యాధితో బాధ పడుతూ..ఆసుపత్రిలో చేరింది. ఐసీయూలో చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే..అక్కడ ఖాళీ లేకపోవడంతో ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అక్కడ చాలా మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. అయినా..ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు ఆ యువతి.

తనకు పాటలు వినాలని ఉందని..డాక్టర్లకు చెప్పడంతో వారు అందుకు అంగీకరించారు. బెడ్ పైనే కూర్చుని హ్యాపీగా పాటలు వింటూ ఎంజాయ్ చేసింది. ఇదంతా..నాలుగు రోజుల క్రితం ముచ్చట.

ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకి తరలించారు. ధైర్యశాలి కోసం ప్రార్థిద్దామని డాక్టర్ మోనికానే వెల్లడించారు. ఆ యువతి కరోనాను జయించలేకపోయింది. గురువారం కన్నుమూసింది. అంత సంతోషంగా..చేతులు ఊపుతూ..పాటలు వింటూ..తెగ ఎంజాయ్ చేసిన ఆ యువతి ఇక లేదని తెలుసుకున్న నెటిజన్లు శ్రద్ధంజలి ఘటిస్తున్నారు. ప్రఖ్యాత నటుడు సోనూ సూద్ కూడా స్పందించారు.

Read More : kidnap: డబ్బుకోసం బాలుడి కిడ్నాప్.. అనంతరం హత్య.. ఇదంతా చేసింది బంధువులే.