IAS Roshan Jacob : రోడ్డుప్ర‌మాదంలో గాయ‌ప‌డిన చిన్నారులను చూసి కన్నీరు పెట్టుకున్న ఐఏఎస్ అధికారిణి

రోడ్డుప్ర‌మాదంలో గాయ‌ప‌డిన చిన్నరులను చూసి కన్నీరు పెట్టుకున్నా ఓ ఐఏఎస్ అధికారిణి.

IAS Roshan Jacob : రోడ్డుప్ర‌మాదంలో గాయ‌ప‌డిన చిన్నారులను చూసి కన్నీరు పెట్టుకున్న ఐఏఎస్ అధికారిణి

Lucknow Divisional Commissioner Roshan Jacob meets mother of child injured in accident breaks down

Lucknow Commissioner Roshan Jacob : రోడ్డుప్ర‌మాదంలో గాయ‌ప‌డిన చిన్నారిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు ఓ మహిళా ఐఏఎస్ అధికారి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపూర్‌ఖేరిలో బ‌స్సు – ట్ర‌క్కు ఢీకొన్న ప్రమాదంలో 12 మంది మృతి చెందగా మరో 41మందికి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని లఖింపూర్ ఖేరి ఆస్పత్రికి తరలించారు.గాయపడినవారిలో చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడినవారిని పరామర్శించటానికి..వారి పరిస్థితిని సమీక్షించటానికి..మెరుగైన వైద్యం అందేలా చూడటానికి ఆస్పత్రికి వచ్చారు ఐఏఎస్ అధికారిణి రోష‌న్ జాక‌బ్. ఈ సందర్భంగా ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఓ బాలుడిని చూసిన ల‌క్నో డివిజ‌న‌ల్ క‌మిష‌న‌ర్ రోష‌న్ జాక‌బ్ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ బాలుడి పరిస్థితి చూసి చలించిపోయారు. కంటతడిపెట్టుకున్నారు.

గాయ‌ప‌డ్డ చిన్నారుల ఆరోగ్య ప‌రిస్థితిని వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాల‌ని ఆమె ఆదేశించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. కాగా తిరువనంతపురంలో జన్మించిన రోషన్ జాకబ్ 2004 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. రెండు వారాల క్రితం లక్నోలోని నీటితో నిండిన వీధులను పరిశీలించిన సందర్భంలో ఆమె మోకాలు లోతు బురదనీటిలో నడుస్తూ పరిస్థితిని సమీక్షించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఐఏఎస్ అధికారి అంటే కేవలం ఏసీ రూముల్లో కూర్చుని పనిచేయటమేకాదు..ప్రజల్లో తిరిగాలి..వారి బాగోగులు..కష్టాలు తెలుసుకోవాలనే అంకిత భావం కలిగిన అధికారిణి ఈ రోషన్ జాకబ్.

కాగా..ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపూర్‌ఖేరిలో 730 నేషనల్ హైవే ఐరా బ్రిడ్జిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12మంది మృతి చెందారు. 41మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..ప్రధాని మోడీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.