Maharashtra : ప్రేయసి కళ్లల్లో ఆనందం కోసం 19ఏళ్ల యువకుడి ఘనకార్యం .. షాక్ అయిన పోలీసులు

ఓ యువకుడికి ఓ అమ్మాయి ఓర కంట చూస్తేనే అదేదో ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోతాడు. అలాంటి ఓ 19 ఏళ్ల కుర్రాడు తన గాల్ ఫ్రెండ్ కళ్లలో ఆనందం చూడటానికి ఏకంగా ఏం చేశాడంటే..

Maharashtra : ప్రేయసి కళ్లల్లో ఆనందం కోసం 19ఏళ్ల యువకుడి ఘనకార్యం .. షాక్ అయిన పోలీసులు

19 Years Old man bike theft

Maharashtra : 19 నవ యువకుడికి ఓ అమ్మాయి ఓర కంట చూస్తేనే అదేదో ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోతాడు. అటువంటిది 19ఏళ్లకే ఓ గాల్ ఫ్రెండ్ ను సెట్ చేస్తే ఇక ఆ అబ్బాయి సాక్షాత్తూ సినిమా హీరో అయినట్లే ఫీలైపోతాడు. మరి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయటానికి తన హీరోయిజాన్ని చూపించటానికి ఏవేవో చేయటానికి నానా పాట్లు పడతాడు. అలాంటి ఓ 19 ఏళ్ల కుర్రాడు తన గాల్ ఫ్రెండ్ కళ్లలో ఆనందం చూడటానికి ఏకంగా దొంగతనాలు చేయటానికి సిద్ధపడ్డాడు. సిద్దపడటమేంటీ..ఏకంగా బైకులు చోరీలు చేయటమే పనిగా పెట్టుకున్నాడు. ఆ డబ్బులతో అమ్మాయికి గిఫ్టులు కొని హీరోయిజం చూపించటంలో ‘కిక్’ఫీలయ్యేవాడు. అలా ఆమెకు తనపై ఆ గొప్ప ఫీలింగ్ కోసం బైకులో చోరీ చేయటమే పనిగా పెట్టుకున్నాడు. ఆమె కళ్లల్లో ఆనందం చూసే భాగ్యం తపించిపోయేవాడు. మరి 19ఏళ్ల ఓ సాధారణ యువకుడిగా అది గొప్పేమరి..కానీ ఆమె ఆనందం కోసం దొంగగా మారి భవిష్యత్తును అంధకారం చేసుకున్నాడు. దొంగ అనే ముద్ర వేసుకున్నాడు. ‘ప్రేమ కోసమై వల’లో పడనే పాపం పసివాడు అన్నట్లుగా అయిపోయింది అతగాడి పరిస్థితి.

మహారాష్టరంలోని థానే జిల్లాకు చెందిన ఆ నవ యవ్వన ప్రేమికుడు పేరు శుభమ్ పవార్. వయస్సు 19 ఏళ్లు. గాళ్ ఫ్రెండ్ కు గిఫ్టులు కొనివ్వటానికి ఖరీదైన బైకులు చోరీ చేస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు. థానే జిల్లాలోని కల్యాణ్ ఏరియాలో బైకులు కనిపించకుండాపోతున్నాయి. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ కు వరస ఫిర్యాదు రావటం మొదలుపెట్టాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిఘా పెట్టారు. ఆ ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజ్ లు పరిశీలించటంతో బైకులు చోరీ చేసేది శుభమ్ భాస్కర్ పవార్ అని తేలింది. అలా ఒకటీ రెండూ కాదు ఏకంగా 19 ఏళ్ల శుబర్ పవార్ ఎన్నో బైకులు చోరీ చేయగా అతని నుంచి 13 బైకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తన గాళ్ ఫ్రెండ్ కోసమే ఈ చోరీలు చేస్తున్నానని చెప్పాడు పోలీసులకు. అది విన్న పోలీసులు షాక్ అయ్యారు.

లాతూర్, షోలాపూర్, పుణే ప్రాంతాల్లో మిస్ అయిన బైకుల్ని గుర్తించారు పోలీసులు. శుభమ్ భాస్కర్ దొంగలించిన బైకుల విలువ రూ.16.05 లక్షలు అని డీసీపీ తెలిపారు. అలా పాపం ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న 19 ఏళ్లకే దొంగలా ముద్ర పడి కోర్టు మెట్లెక్కనున్నాడు.