కరోనా భయం….మహారాష్ట్ర,వెస్ట్ బెంగాల్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

  • Published By: venkaiahnaidu ,Published On : March 17, 2020 / 02:22 AM IST
కరోనా భయం….మహారాష్ట్ర,వెస్ట్ బెంగాల్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

కరోనా వైరస్‌ దృష్ట్యా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆరు వారాలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వాయిదాపై ఏపీ సీఎం ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పశ్చిమబెంగాల్‌లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల తేదీలపై నిర్ణయం తీసుకునేందుకు సోమవారం కోల్‌కతాలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సౌరవ్‌ దాస్‌ ప్రకటించారు.

మరోవైపు మహారాష్ట్ర లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా వైరస్…వ్యాక్సిన్ లేని అంటువ్యాధి. ఇది మనుషుల నుంచి మనుషులకు చాలా ఈజీగా సోకే ప్రమాదం ఉన్నందున దేశంలో ఎక్కిడికక్కడ మనుషులు ఎక్కువగా ఒకచోట చేరుకండా సినిమా థియేటర్లు,మాల్స్,రెస్టారెంట్లు,చారిత్రక కట్టడాల సందర్శనను ఇలా అన్నింటినీ భారత్ లోని చాలా రాష్ట్రాలు నిలిపివేశాయి. ఎన్నికలు జరిగితే పెద్ద ఎత్తున ప్రజలు ఒకచోరుతారు. దీంతో చాలా వేగంగా వైరస్ వ్యాప్తి చేందే అవకాశమున్నందున స్థానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేశారు.