Thermocol Raft : థర్మాకోల్ తెప్పపై ప్రయాణం, నదిలో పాములతో పోరాడుతూ స్కూల్ కెళుతున్న పిల్లలు

విద్యార్ధులు స్కూల్ కు వెళ్లాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందేనా..? భారత్ లోని పలు రాష్ట్రాల్లో పిల్లలు కొండలు గుట్టలు ఎక్కి..తీగలపై నడిచి..వాగులు, నదులు దాటి స్కూల్ కు వెళుతున్న పరిస్థితులు ఉన్నాయి. అటువంటిదే ఈ దృశ్యం. పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే ప్రతీ రోజు ప్రాణాలు పణంగా పెట్టాల్సిన భయానక పరిస్థితి.

Thermocol Raft : థర్మాకోల్ తెప్పపై ప్రయాణం, నదిలో పాములతో పోరాడుతూ స్కూల్ కెళుతున్న పిల్లలు

Maharashtra Bhiw Dhanora village students thermocol raft

Updated On : August 30, 2023 / 12:50 PM IST

Thermocol Raft- Students : విద్యార్ధులు స్కూల్ కు వెళ్లాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిందేనా..? అనేలా ఈనాటికి ఎంతోమంది పిల్లలు తమ ప్రాణాలను పణంగా పెట్టి స్కూల్ కు వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. ఇక వర్షాకాలం వచ్చిందంటే భారత్ లోని పలు రాష్ట్రాల్లో పిల్లలు కొండలు గుట్టలు ఎక్కి.. తీగలపై నడిచి.. వాగులు, నదులు దాటి స్కూల్ కు వెళుతున్న పరిస్థితులు ఉన్నాయి. అటువంటిదే మహారాష్ట్ర (Maharashtra) లోని ఈ దృశ్యం. ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లా (Chhatrapati Sambhaji Nagar district)లోని బివాధనోరా గ్రామం (Bhiw Dhanora village) పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే ప్రతీ రోజు ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే.

బివాధనోరా గ్రామంలో పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే నది దాటాలి. నది దాటేందుకు కేవలం ఓ థర్మాకోల్ తో తయారు చేసిన తెప్ప (thermocol raft) వారికి ఆధారం. ఏమాత్రం తేడా వచ్చినా.. బ్యాలెన్స్ తప్పినా తెప్ప తిరగబడుతుంది. అదే జరిగితే పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే. భివాధనోరా గ్రామంలో పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే ప్రతీ రోజు కత్తిమీద సామే. వేరే దారిలేక.. ఆ తెప్పపైనే స్కూలుకు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో నదిలో పాములు ఎదురెక్కుతుంటాయి. తెప్పమీదకు చేరటానికి యత్నిస్తుంటాయి. దీంతో పిల్లలు ఓ కర్ర పట్టుకుని పాముల్ని ఎదుర్కొంటూ నది దాటుతుంటారు. ఈ క్రమంలో తెప్ప తిరగబడినా.. ఏ పామైన కాటు వేసినా వారి ప్రాణాలు పోయే భయానక పరిస్థితి.

Delhi G-20 : ఢిల్లీలో జీ-20 సదస్సు, కొండముచ్చులా అరిచే ఉద్యోగుల్ని రంగంలోకి దింపిన కేంద్ర ప్రభుత్వం

మహారాష్ట్రలోని పెద్ద ఆనకట్టల్లో ఒకటైన జాయక్‌వాడీ డ్యామ్‌ (Jayakwadi dam )కు సమీపంలో ఉంటుంది బివాధనోరా గ్రామం. డ్యాం బ్యాక్ వాటర్ (Jayakwadi dam backwater) రెండు నదులు గ్రామాన్ని చుట్టుముట్టి ఉంటాయి. వంతెన నిర్మాణం డిమాండు ఎప్పటినుంచో పెండింగులో ఉంది. కానీ అది నెరవేరటంలేదు. గ్రామంలోని పిల్లలు బడికి వెళ్లాలంటే మందపాటి థర్మాకోల్‌ తెప్పలే ఆధారం. విద్యార్థులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఆ తెప్పలాంటిదానిపైనే ప్రతీరోజు బ్యాక్‌వాటర్‌ను దాటి స్కూల్ కు వెళ్లి వస్తున్నారు.

ఒక్కోసారి పాములు థర్మాకోల్‌ తెప్పపైకి పాకుతూ వచ్చేస్తాయి. దీంతో పిల్లు ఓ కర్ర పట్టుకుని వాటిని ఎదుర్కొంటూ.. రోజూ కిలోమీటరు దూరం డ్యాం నీటిని దాటి వెళుతున్నారు. దాదాపు 50 ఏళ్లుగా అదే సమస్యలను ఎదుర్కొంటున్నారు ఆ గ్రామస్తులు. దీనిపై అధికారులు వెర్షన్ మాత్రం వేరుగా ఉంది. డ్యాం నిర్మించే సమయంలో పునరావాసం కల్పిస్తామన్నా కొందరు అక్కడే ఉండిపోయారని దీంతో వారు ఆ సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోందంటున్నారు.

Sanjay Raut : లోక్‌సభ ఎన్నికలకు ముందు గోద్రా తరహా ఘటన జరగొచ్చు…సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు