Maharashtra : రైతుల భక్తి.. 2,000 కిలోల ద్రాక్షపండ్ల‌తో గణేషుడికి అలంక‌ర‌ణ‌

గణేషుడి పట్ల ద్రాక్ష రైతుల భక్తి చాటుకున్నారు. 2,000 కిలోల ద్రాక్షపండ్ల‌తో గణేషుడికి కానుకగా ఇచ్చారు. ఆ ద్రాక్ష పండ్ల‌తో గణనాధుడికి అలంక‌ర‌ణ చేశారు అర్చకులు.

Maharashtra : రైతుల భక్తి.. 2,000 కిలోల ద్రాక్షపండ్ల‌తో గణేషుడికి అలంక‌ర‌ణ‌

Dagadusheth Halwai Ganapati Temple Decorated 2,000 Kg Grapes (1)

Dagadusheth Halwai Ganapati temple decorated 2,000 kg grapes : గణనాథుడు ఏ రూపంలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు. ఆకులోను..పూలలోను పండ్లలోను ఇట్టే ఒదిగిపోతాడు. అటువంటి గణేషుడి ద్రాక్షరైతులు తమ పంటతో అలంకరించి తమ భక్తిని చాటుకున్నారు. వేల కిలోల ద్రాక్ష పండల్తో అలంకరించి గ‌ణ‌నాథుడి ప‌ట్ల త‌మ‌కున్న భ‌క్తిని రైతులు చాటుకున్నారు. గ‌ణేషుడి విగ్ర‌హ అలంక‌ర‌ణ‌కు 2 వేల కిలోల ద్రాక్ష పండ్ల‌ను రైతులు విరాళంగా ఇచ్చారు.

మహారాష్ట్ర పుణెలోని ద‌గ్ద‌సేత్ హ‌ల్వాయి గ‌ణ‌ప‌తి టెంపుల్‌లో 2,000 కిలోల ద్రాక్ష పండ్ల‌తో అలంక‌ర‌ణ చేశారు. సంక్ష‌తి చ‌తుర్ధి సందర్భంగా ద్రాక్ష పండ్ల‌తో ఆల‌యాన్ని అలంక‌రించామ‌ని అర్చ‌కులు తెలిపారు. ఈ ప్రత్యేక పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం ఈ ద్రాక్ష పండ్ల‌ను ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల‌కు, ఎన్జీవోల్లో ఆశ్ర‌యం పొందుతున్న నిరాశ్ర‌యుల‌కు ప్ర‌సాదంగా అందిస్తామని స‌హ్యాద్రి ఫామ్స్ సభ్యులు మీడియాకు వెల్ల‌డించారు.