భార్య కోసం 8 గంటలు కొబ్బరి చెట్టు ఎక్కి ఆందోళన

10TV Telugu News

Man protests atop tree to bring back wife in Karnataka’s Kudligi taluka : తమ సమస్యలను పరిష్కారం కోసం ఏమైనా చేస్తుంటారు. కొంతమంది రోడ్లపై బైఠాయించడం చేస్తే..ఇంకొంతమంది భవనాలు, సెల్ టవర్లు ఎక్కి నిరసనలు వ్యక్తం చేస్తుంటారనేది చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం భార్య కోసం కొబ్బరి చెట్టు ఎక్కాడు. ఒక గంట కాదు..రెండు గంటలు కాదు..ఏకంగా 8 గంటలు పాటు చెట్టుపైనే ఉండి ఆందోళన చేశాడు. కిందకు దిగు..గొడవను పరిష్కరిస్తామని అక్కడి పెద్దలు చెప్పినా..నో చెప్పాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని కుడ్లిగి తాలుకాలో జరిగింది. దొడ్డప్ప, భార్యతో కుడ్లిగి గ్రామంలో నివాసం ఉంటున్నాడు.

దొడ్డప్ప కొబ్బరి చెట్టు ఎక్కి ఆందోళన చేయగాసాగాడు. తన భార్యను తనతో కలపాలని డిమాండ్ చేశాడు. గొడవలు జరగడంతో ఐదేళ్ల క్రితం ఆమె అతడిని విడిచిపెట్టి వెళ్లిందని గ్రామస్తులు వెల్లడించారు. ఇల్లు, ముగ్గురు సంతానాన్ని చూసుకోవడం తనకు కష్టంగా మారిందని, ఈ సమస్యను పరిష్కరించడంలో గ్రామ పెద్దలు విఫలమయ్యారని వెల్లడించాడు. తన భార్య తన దగ్గరకు వస్తేనే..కొబ్బరి చెట్టు దిగుతానని స్పష్టం చేశాడు.  దొద్దప్పకు రెండుసార్లు వివాహం చేసుకున్నాడని, అతనిని విడిచిపెట్టి వెళ్లింది రెండో భార్య అని గ్రామస్తులు తెలిపారు. మొదటి భార్య గర్భం దాల్చకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడని, కానీ..వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవన్నారు.

అందుకే ఆమె విడిచిపెట్టి వెళ్లిపోయిందన్నారు. చివరకు ఈ విషయం పోలీసులకు తెలిసింది. అక్కడకు చేరుకని దొడ్డప్పను సముదాయించే ప్రయత్నం చేశారు. చివరకు అతని భార్యను అక్కడకు తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో కిందకు దింపారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, భార్య భర్తలిద్దరితో గ్రామ పెద్దలు మాట్లాడరని PSI H Nagaraj తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.