Karnataka High Court: పెళ్లైన కూతుళ్లకూ తల్లిదండ్రుల ఇన్సూరెన్స్‌లో వాటా: కర్ణాటక హై కోర్టు

తల్లిదండ్రులు ప్రమాదవశాత్తు మరణిస్తే.. పెళ్లైన కూతుళ్లకు కూడా ఇన్సూరెన్స్‌లో వాటా ఇవ్వాలని కర్ణాటక హై కోర్టు ఆదేశించింది. జస్టిస్ హెచ్‌పీ సందేశ్ ధర్మాసనం తాజా తీర్పునిచ్చింది.

Karnataka High Court: పెళ్లైన కూతుళ్లకూ తల్లిదండ్రుల ఇన్సూరెన్స్‌లో వాటా: కర్ణాటక హై కోర్టు

Karnataka High Court: తల్లిదండ్రుల ఇన్సూరెన్స్‌లో పెళ్లైన కూతుళ్లకూ వాటా ఉంటుందని చెప్పింది కర్ణాటక హై కోర్టు. ఒక కేసు విచారణ సందర్భంగా తాజా తీర్పు ఇచ్చింది. రేణుక అనే 57 ఏళ్ల మహిళ 2012 ఏప్రిల్‌లో రోడ్డు ప్రమాదంలో మరణించింది. యాక్సిడెంట్‌లో మరణించినందున నష్టపరిహారం కోరుతూ ఆమె కుటుంబ సభ్యులు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.

Gurugram Club: క్లబ్బులో మహిళతో బౌన్సర్ల అసభ్య ప్రవర్తన… ప్రశ్నించినందుకు దాడి.. వీడియో వైరల్‌

ఆమె భర్త, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.. అందరూ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేశారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ అందరికీ రూ.5,91,600 డబ్బును, 6 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఇన్సూరెన్స్ సంస్థను ఆదేశించింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇన్సూరెన్స్ సంస్థ కోర్డును ఆశ్రయించింది. ఆమె భర్త, కుమారుడు మాత్రమే ‘డిపెండెంట్’ అవుతారని, పెళ్లైన కుమార్తెలు ఆమెపై ఆధారపడలేదని, అందువల్ల వాళ్లు ‘డిపెండెంట్లు’ కాదని ఇన్సూరెన్స్ సంస్థ వాదించింది. కాబట్టి, కూతుళ్లకు ఇందులో వాటా ఇవ్వలేమని వాదించింది. కానీ, కర్ణాటక హైకోర్టు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పెళ్లైన కొడుకులకు కూడా హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పిందని, అందువల్ల పెళ్లైన కూతుళ్లకు కూడా హక్కు ఉంటుందని అభిప్రాయపడింది.

Karnataka: స్నేహితులే కిడ్నాపర్లు.. కోటి రూపాయలు గెలుచుకున్న యువకుడిని కిడ్నాప్ చేసిన ఫ్రెండ్స్

అలాగే డిపెండెంట్ అంటే ఫైనాన్షియల్ డిపెండెంట్ మాత్రమే కాదని.. ఎమోషనల్, ఫిజికల్, సర్వీస్, సైకలాజికల్.. ఇలా అనేక రకాలుగా డిపెండెంట్ అయ్యుండొచ్చని చెప్పింది. దీనిప్రకారం కూతుళ్లు కూడా డిపెండెంట్‌లే అని, వారికి కూడా ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించాలని ఆదేశించింది. ప్రమాదవశాత్తు తల్లిదండ్రులు మరణిస్తే, పెళ్లైన కూతుళ్లకు ఇన్సూరెన్స్‌లో వాటా ఇవ్వాల్సిందే అని జస్టిస్ హెచ్‌పీ సందేశ్ ధర్మాసనం తీర్పునిచ్చింది.