Karnataka: స్నేహితులే కిడ్నాపర్లు.. కోటి రూపాయలు గెలుచుకున్న యువకుడిని కిడ్నాప్ చేసిన ఫ్రెండ్స్

కోటి రూపాయలు గెలుచుకున్న యువకుడిని అతడి స్నేహితులే కిడ్నాప్ చేశారు. అతడి తండ్రికి ఫోన్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే చంపేస్తామని బెదిరించారు.

Karnataka: స్నేహితులే కిడ్నాపర్లు.. కోటి రూపాయలు గెలుచుకున్న యువకుడిని కిడ్నాప్ చేసిన ఫ్రెండ్స్

Karnataka: కోటి రూపాయలు గెలుచుకున్న యువకుడిని డబ్బు కోసం స్నేహితులే కిడ్నాప్ చేసిన ఘటన ఇటీవల కర్ణాటకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుబ్లి జిల్లాకు చెందిన గరీబ్ నవాజ్ అనే యువకుడు ఇటీవల ఒక ఆన్‌లైన్‌ గేమ్‌లో కోటి రూపాయలకు పైగా డబ్బు గెలుచుకున్నాడు.

Gurugram Club: క్లబ్బులో మహిళతో బౌన్సర్ల అసభ్య ప్రవర్తన… ప్రశ్నించినందుకు దాడి.. వీడియో వైరల్‌

అయితే నవాజ్‌ను అభినందించి, ఆనందించాల్సిన అతడి స్నేహితులు డబ్బు కోసం ఆశపడ్డారు. అతడి దగ్గరి నుంచి డబ్బును ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నారు. ఏళ్లుగా ఉన్న స్నేహాన్ని మరిచి ఏడుగురు యువకులు కలిసి నవాజ్‌ను కిడ్నాప్ చేశారు. రహస్య ప్రాంతంలో దాచారు. తర్వాత నవాజ్‌ తండ్రికి ఫోన్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే అతడ్ని చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడ్డ నవాజ్‌ తండ్రి రూ.15 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Ticket Prices: విమాన టిక్కెట్ల ధరలపై పరిమితి తొలగింపు.. కేంద్రం తాజా నిర్ణయం

మరోవైపు తండ్రి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నవాజ్‌ను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చివరకు పోలీసులు నవాజ్‌ను రక్షించారు. అతడి స్నేహితులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహ్మద్ ఆరిఫ్, ఇమ్రాన్, అబ్దుల్ కరీం, హుస్సేన్ సాబ్, ఇమ్రాన్ ఎమ్, తౌఫిఫ్, మొహమ్మద్ రజాక్‌గా గుర్తించారు.