Mask Rule: ఎయిర్‌పోర్టులో మళ్లీ మాస్క్ రూల్

ఢిల్లీ హైకోర్టు ఆదేశాలనుసారం ఏవియేషన్ రెగ్యూలేటర్ డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిలి్ ఏవియేషన్ (DGCA) కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే ఎయిర్‌పోర్టుల్లో, ఎయిర్‌క్రాఫ్ట్‌లలోనూ జర్నీ చేస్తున్నంతసేపు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

Mask Rule: ఎయిర్‌పోర్టులో మళ్లీ మాస్క్ రూల్

Mask Rule

Mask Rule: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలనుసారం ఏవియేషన్ రెగ్యూలేటర్ డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిలి్ ఏవియేషన్ (DGCA) కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే ఎయిర్‌పోర్టుల్లో, ఎయిర్‌క్రాఫ్ట్‌లలోనూ జర్నీ చేస్తున్నంతసేపు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రత్యేక సందర్భాల్లో తప్ప మాస్క్ తీయడానికి వీల్లేదని చెప్పింది. రూల్స్ పాటించని వాళ్లను ప్రయాణానికి అనర్హులుగా నిర్ణయించవచ్చని చెప్పింది.

మాస్క్ రూల్స్ అతిక్రమించిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఎయిర్‌పోర్టు, ఎయిర్‌క్రాఫ్ట్ శుభ్రతా ప్రమాణాలు పాటించాలని పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం పిలుపునిచ్చింది.

నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలిన వారందరినీ బుక్ చేసి జరిమానా విధించాలని, వారిని నో-ఫ్లై లిస్ట్‌లో ఉంచాలని హైకోర్టు పేర్కొంది. చాలా తరచుగా నిబంధనలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సహా అధికారులు తప్పనిసరిగా అమలు చేసేలా చూసుకోవడం చాలా అవసరం అని పేర్కొంది.

Read Also : బెంగళూరులో మాస్క్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం

“ఎయిర్‌హోస్టెస్‌లు, కెప్టెన్లు, పైలట్లు ఇతరులతో సహా విమానాశ్రయాలలో, విమానాల్లోని సిబ్బందికి మాస్కులు పాటించేలా చేసే అధికారం ఇవ్వడానికి DGCA అన్ని విమానయాన సంస్థలకు ప్రత్యేక నిర్దేశాలను ఇవ్వాలని భావిస్తున్నాం. ప్రయాణికులు, ఇతరులపై ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాస్కింగ్, చేతుల పరిశుభ్రత నిబంధనలు తప్పనిసరి ”అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ, జస్టిస్ సచిన్ దత్తాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.