Parliament: పార్లమెంటులో మళ్ళీ మాస్కులు పెట్టుకుని కనపడ్డ ఓం బిర్లా, ధన్‌కర్, మోదీ

చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం, మన దేశంలోనూ ఆ వైరస్ విజృంభించే ప్రమాదం ఉండడంతో పార్లమెంటులో మళ్ళీ మాస్కు నిబంధన పాటిస్తున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఇవాళ మాస్కు ధరించి కనపడ్డారు. సభ్యులు అందరూ మాస్కులు ధరించాలని లోక్‌సభలో ఓం బిర్లా, రాజ్యసభలో ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ కోరారు. దేశంలో కరోనా విజృంభించకుండా చర్యలు తీసుకుంటున్నామని లోక్ సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ ఓ ప్రకటన చేశారు.

Parliament: పార్లమెంటులో మళ్ళీ మాస్కులు పెట్టుకుని కనపడ్డ ఓం బిర్లా, ధన్‌కర్, మోదీ

Parliament

Parliament: చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం, మన దేశంలోనూ ఆ వైరస్ విజృంభించే ప్రమాదం ఉండడంతో పార్లమెంటులో మళ్ళీ మాస్కు నిబంధన పాటిస్తున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఇవాళ మాస్కు ధరించి కనపడ్డారు. సభ్యులు అందరూ మాస్కులు ధరించాలని లోక్‌సభలో ఓం బిర్లా, రాజ్యసభలో ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ కోరారు.

దేశంలో కరోనా విజృంభించకుండా చర్యలు తీసుకుంటున్నామని లోక్ సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ ఓ ప్రకటన చేశారు. కేంద్ర మాజీ ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… కరోనా విజృంభణను అరికట్టడంలో మాస్కులు బాగా ఉపయోగపడతాయని చెప్పారు. సరైన సమయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతేగాక, మాస్కులు పెట్టుకుంటే ఎటువంటి ప్రతికూల ప్రభావమూ ఉండబోదని, కాలుష్యం నుంచీ అవి కాపాడతాయని చెప్పుకొచ్చారు.

చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 కేసులు భారత్ లోనూ 4 నమోదయ్యాయని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. కాగా, చైనా-భారత్ మధ్య సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న ఘటనలపై పార్లమెంటులో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా లోక్ సభలో విపక్షాలు దీనిపై పట్టుబడడంతో సభ పలుసార్లు వాయిదా పడింది.

Pakistan To Ukraine Supply Arms : యుక్రెయిన్‌కు పాకిస్థాన్ ఆయుధ సహాయం..సముద్ర మార్గంలో పంపనున్న పాక్