మోడీ ప్రపోజల్ కి జై కొట్టిన పాకిస్తాన్

మోడీ ప్రపోజల్  కి  జై కొట్టిన పాకిస్తాన్

Modi’s proposal భవిష్యత్తులో వచ్చే వ్యాధులను దృష్టిలో ఉంచుకుని దేశాలు పరస్పరం సహకరించుకోవాలని, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఒక దేశంలోని డాక్టర్లు మరో దేశానికి వెళ్లడానికి వారికోసం ప్రత్యేక వీసాలను రూపొందించాలని ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు పాకిస్తాన్ స్వాగతించింది.

10 ఇరుగు పొరుగు దేశాలతో కలిసి ‘కోవిడ్‌–19 మేనేజ్‌మెంట్‌: ఎక్స్‌పీరియన్స్, గుడ్‌ ప్రాక్టీసెస్, వే ఫార్వర్డ్‌’ పేరిట గురువారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయా దేశాల ప్రతినిధులను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ.. కొవిడ్​-19 వాక్సిన్​ సమాచారాన్ని పంచుకొని, టీకాను మరింత మెరుగ్గా మన దేశాల ప్రజలకు ఇవ్వడానికి ప్రాంతీయ కార్యచరణను రూపొందించుకోలేమా? వ్యాధిసంబంధిత సాంకేతికత సాయంతో భవిష్యత్తులో మహమ్మారులు రాకుండా చూసేందుకు ప్రాంతీయ కార్యచరణనను ఏర్పరచుకోలేమా? భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశాలు పరస్పర సహకారంతో, ప్రత్యేక కార్యచరణను రూపొందించుకోవాలి.

ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఒక దేశంలోని వైద్యులు మరో దేశానికి వెంటనే వెళ్లడానికి వీలుగా వారికోసం ప్రత్యేక వీసాలు తీసుకురావాలని సమావేశంలో పాల్గొన్న దేశాలను ప్రధాని కోరారు. అంతేకాకుండా దేశాల విదేశాంగ మంత్రులు చర్చించుకుని ఎయిర్​ అంబులెన్స్​ల​కు సంబంధించి వైద్యసంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని మోడీ సూచించారు. అంతేకాకుండా దేశాల మధ్య ఆరోగ్య సంబంధిత పథకాల సమాచారాన్ని పంచుకోవాలని ప్రధాని కోరారు. మోడీ ఇచ్చిన ఐదు సూచనలకు పాకిస్తాన్ తో సహా పది దేశాలు మద్దతు పలికాయి