వైరల్ వీడియో: తొండంతో పిల్ల ఏనుగును డివైడర్ దాటించిన ఏనుగు

  • Published By: Chandu 10tv ,Published On : July 4, 2020 / 02:05 PM IST
వైరల్ వీడియో: తొండంతో పిల్ల ఏనుగును డివైడర్ దాటించిన ఏనుగు

రోడ్డు మీద ఉన్న డివైడర్ ను దాటడానికి ప్రయత్నిస్తున్న పిల్ల ఏనుగుకు, తల్లి ఏనుగు తన తొండంతో డివైడర్ ను దాటేలా చేస్తుంది. ఈ సృష్టిలో తల్లి ప్రేమకు మించినది ఏమీ లేదు. తల్లి తన పిల్లల కోసం ఏమైనా చేయటానికైనా సిద్ధంగా ఉంటుంది. తల్లి ప్రేమ మనుషులల్లోనైనా, జంతువులల్లోనైనా ఒకటే అని తెలిపే నిదర్శనం ఈ వీడియో. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కేరళలోని మల్లాప్పురం జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను అనీశ్ కటా అనే వ్యక్తి పంచుకున్నారు. గురువారం(జూలై2,2020)న ఉదయం 7:30 గంటల ప్రాంతంలో మరో ముగ్గురితో కలిసి అనీశ్ కటా సైక్లింగ్ కు వెళ్లారు. ఆ సమయంలో కేరళ-తమిళనాడు సరిహద్దు సమీపంలో నాడుకని చురం వద్ద 3 ఏనుగులు రోడ్డు దాటుతున్నాయి. వీటిలో రెండు ఏనుగులు ఈజీగానే డివైడర్ ను దాటేశాయి. కానీ మరో పిల్ల ఏనుగు మాత్రం డివైడర్ ను దాటడానికి చాలా సార్లు ప్రయత్నించి విఫలమయ్యింది.

పిల్ల ఏనుగు రోడ్డు దాటలేకపోతు ఇబ్బంది పడుతుంది. దీంతో తల్లి ఏనుగు తన తొండంతో పిల్ల ఏనుగు డివైడర్ దాటడంలో సహాయం చేసింది. అది క్షేమంగా డివైడర్ ను దాటేసింది. ఈ సంఘటనను అనీశ్ కటా వీడియో తీసి పంచుకున్నారు. అనీశ్ కటా మాట్లాడుతూ,‘ఇది నా హృదయాన్ని తాకింది. బిడ్డ పట్ల తల్లి చూపించే ప్రేమకు నిదర్శం’అని అన్నారు. అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతం, లాక్ డౌన్ సమయం వల్ల అక్కడ ఎక్కువ ట్రాఫిక్ లేదు అని అనీశ్ తెలిపారు.


ఈ వీడియోపై మాజీ పర్యావరణ మంత్రి జైరాం రమేష్ కూడా ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆ ఏనుగులు బారియర్ ను దాటేవరకు వేచి చూసిన లారీ డ్రైవర్లను ప్రత్యేకంగా ఆయన అభినందించారు.

Read:నాగాలాండ్ లో కుక్కల మాంసం నిషేధం