జ్వరం అంటూ వెళ్లిన బాలికపై డాక్టర్ లైంగిక దాడి

జ్వరం అంటూ వెళ్లిన బాలికపై డాక్టర్ లైంగిక దాడి

ముంబై పోలీసులు భీవండీకి చెందిన డాక్టర్ ను మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టు చేశారు. జలుబు జ్వరంతో బాధపడుతుండగా తమ్ముడితో కలిసి డా.బద్రుజమా ఖాన్ కలిసేందుకు 15ఏళ్ల బాలిక వెళ్లింది. అనారోగ్యంతో వచ్చిన బాలికను మిగిలిన పేషెంట్లు వెళ్లేంత వరకూ వెయిట్ చేయించాడు.



ఇతర పేషెంట్లు అంతా వెళ్లిపోయాక.. ‘లోపలికి పిలిచి తినడానికి ఏమైనా తీసుకురావాలని కాంపౌండర్ కు చెప్పాడు. బాలిక తమ్ముడిని ఇంకా డబ్బులు తీసుకురావాలంటూ చెప్పి పంపించి క్లినిక్ లాక్ వేయించాడు. ఆ తర్వాత బాలికను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఒక్క మాట కూడా ఎవరికీ చెప్పొద్దని భయపెట్టాడు’



తన ఆంటీకి జరిగిన ఘటన గురించి చెప్పగా శాంతినగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పోలీసులు సెక్సువల్ అఫెన్స్(పొస్కో) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం నిందితుడిని విచారిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.