Razia Sultan : బీహార్‌లో DSPగా తొలి ముస్లిం యువతి

బీహార్‌లో తొలిసారిగా ఓ ముస్లిం DSPగా ఎంపికై రికార్డు క్రియేట్ చేశారు. బీహార్ లోని గోపాల్‌గంజ్ జిల్లాలో హతువాకు చెందిన 27 ఏళ్ల రజియా సుల్తాన్ DSPగా ఎంపికయ్యారు.

Razia Sultan : బీహార్‌లో DSPగా తొలి ముస్లిం యువతి

Razia Sultan (1)

Muslim Yong girl selected dsp in bihar police : బీహార్‌లో తొలిసారిగా ఓ ముస్లిం DSPగా ఎంపికై రికార్డు క్రియేట్ చేశారు. బీహార్ లోని గోపాల్‌గంజ్ జిల్లాలో హతువాకు చెందిన 27 ఏళ్ల రజియా సుల్తాన్ DSPగా ఎంపికయ్యారు. రజియా సుల్తాన్‌ 64వ బీహార్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ ఎగ్జామ్స్‌లో (BPSP) బీహార్‌ పోలీస్‌ ఫోర్స్‌లో డీఎస్పీగా ఎంపికకాగా..డీఎస్పీలుగా ఎంపికైన 40 మందిలో రజియ ఒకరు కావటం అదికూడా ఓ ముస్లిం మహిళ కావటం మరో విశేషం. రజియా ప్రస్తుతం బీహార్‌ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

రజియాది బీహార్ లోని గోపాల్‌గంజ్‌ అయినప్పటికీ చదువుమాత్రం జార్ఖండ్‌లోని బొకారోలో పూర్తి చేసుకున్నారు. రజియా తండ్రి మహమ్మద్‌ అస్లామ్‌ అన్సారీ బొకారో స్టీల్‌ ప్లాంట్‌లో స్టెనోగ్రాఫర్‌గా పనిచేయటంతో ఆమె బొకారోలోని స్కూల్లో చదువుకోవాల్సి వచ్చింది. జోధ్‌పూర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ కంప్లీట్‌చేసిన రజియాకు చిన్నప్పటినుంచి పబ్లిక్ సర్వీస్ మీద ఆసక్తి ఉండేది. వయస్సుతో పాటు ఆ ఆలోచనలు కూడా పెరిగాయి. అలా తన కలను నెరవేర్చుకున్నారు రజియా.2017లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేదాన్ని అని..పోలీస్‌ అధికారిగా పనిచేయటం అంటే తనకు చాలా చాలా ఇష్టమని..ఈక్రమంలో డీఎస్పీగా ఎంపిక కావటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

ప్రజలకు సరైన సమయంలో సరైన న్యాయం జరగని సందర్భాలు చాలా ఉన్నాయనీ..ముఖ్యంగా మహిళలకు పలు సందర్భాల్లో అన్యాయానికి గురయ్యారని తెలిపారు. ఈక్రమంలో పలు రకాల అవమానాలకు..హింసలకు గురవుతున్నారని..అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయటానికి వెనుకాడుతున్నారని అన్నారు. ఈక్రమంలో తమకు అన్యాయం జరిగినా చాలామంది మౌనంగా భరిస్తున్నారని..ఇటువంటి కేసులు నమోదయ్యేలా తనవంతుగా ప్రయత్నిస్తానని..మహిళలు ఎట్టి పరిస్థితుల్లోను తమకు జరిగిన అన్యాయాలను వెల్లడించాలని..న్యాయం కోసం పోరాడాలని అందుకోసం పోలీసులకు ఫిర్యాదు చేయటానికి ఏమాత్రం వెనుకాడద్దని ఈ సందర్భంగా రజియా సుల్తాన్ సూచించారు.అలాగే ముస్లిం కుటుంబాల్లో ఆడపిల్లలు కుటుంబం ఒత్తిడితో విద్యను మధ్యలోనే మానేస్తున్నారని ఇది సరైందికాదని అన్నారు. ఆడపిల్లలను ఉన్నత చదువులకు ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉందని సూచించారు. దయచేసి అటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా రజియా సుల్తాన్ తల్లిదండ్రులకు సూచించారు.

కాగా..రజియా తండ్రి 2016లోనే మరణించగా తల్లి మాత్రం రజియాలో ధైర్యాన్ని నింపి ఆమె కల సాకారం చేసుకునేలా ప్రోత్సహించారు. రజియా తల్లి ఇప్పటికే జార్ఖండ్ లోని బొకారాలోనే ఉంటున్నారు. రజికాకు ఒక సోదరుడితో పాటు మరో ఆరుగురు సోదరీమణులు ఉన్నారు. ఆరుగురు సోదరీమణుల్లో రజియానే ఆఖరి సోదరి.ఆమె అక్కలు అందరికి వివాహాలు జరిగి సెటిల్ అయ్యారు. సోదరుడు యూపీలో ఎంబీఏ పూర్తి చేసి ఓ ప్రైవేటు కంపెనీలు ఉద్యోగం చేస్తున్నాడు.