Sena vs Sena: శివసేన రెండు గ్రూపులకు పేర్లు కేటాయించిన ఎన్నికల సంఘం

ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే వర్గానికి ‘బాలాసాహేబాంచి శివసేన’ అని పేరు ఖరారు చేయగా.. ఉద్ధవ్ థాకరే వర్గానికి శివసేన (ఉద్ధవ్ బాలాసాహేబ్ థాకరే) పేరును కేటాయించింది. అయితే గుర్తుల కేటాయింపు మాత్రం ఇంకా జరగలేదు. అలాగే ఉద్ధవ్ వర్గం అడిగిన త్రిశూల్, ఉదయిస్తున్న సూర్యుడు, గద గుర్తులను ఈసీ కేటాయించలేదు. ఫ్రీ సింబల్స్ లిస్టులో ఆ గుర్తులు లేనందువల్లే కేటాయించలేదని ఈసీ పేర్కొంది.

Sena vs Sena: శివసేన రెండు గ్రూపులకు పేర్లు కేటాయించిన ఎన్నికల సంఘం

new names, new symbols.. ec to shiv sena

Sena vs Sena: రెండుగా చీలిపోయిన శివసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం పేర్లను కేటాయించింది. ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే వర్గానికి ‘బాలాసాహేబాంచి శివసేన’ అని పేరు ఖరారు చేయగా.. ఉద్ధవ్ థాకరే వర్గానికి శివసేన (ఉద్ధవ్ బాలాసాహేబ్ థాకరే) పేరును కేటాయించింది. అలాగే కాగడ గుర్తును ఎన్నికల గుర్తుగా కేటాయించారు. వాస్తవానికి ఉద్ధవ్ వర్గం త్రిశూల్, ఉదయిస్తున్న సూర్యుడు, గద గుర్తులను తమకు కేటాయించాలని ఈసీని కోరింది. ఫ్రీ సింబల్స్ లిస్టులో ఆ గుర్తులు లేనందువల్లే కేటాయించలేదని ఈసీ పేర్కొంది. పార్టీ పేరు పట్ల ఉద్ధవ్ వర్గం సంతృప్తిగానే ఉన్నప్పటికీ.. ఎన్నికల గుర్తుపై మాత్రం మరోసారి ఈసీని కలవనున్నట్లు తెలుస్తోంది. ఇక షిండే వర్గానికి ఈసీ కేటాయించిన పేరు నచ్చనట్టుంది. తమకు మరిన్ని అప్షన్లు ఇవ్వాలని వారు ఎన్నికల సంఘాన్ని కోరారు.

Whatsapp New Update: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై గ్రూపులో 1024 మందికి అనుమతి.. త్వరలోనే అందుబాటులోకి