ముకేష్ అంబానీ ఇంటికి బాంబు బెదిరింపు కేసులో కొత్త ట్విస్ట్

ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ ఇంటికి బాంబు బెదిరింపు కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. తీహార్ జైల్లోనే ఈ ఘటనకు స్కెచ్ వేశారన్న అనుమానాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. జైష్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థ ఈ కుట్ర వెనుక ఉన్నట్టు తెలుస్తోంది. తీహార్ జైలు నుంచే ఉగ్రవాద చర్యలకు, బెదిరింపులకు ఈ సంస్థ పాల్పడుతున్నట్టుగా తేలింది. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఉగ్రవాదులు ఈ చర్యలకు పాల్పడుతున్నట్టు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భావిస్తున్నారు.

ముకేష్ అంబానీ ఇంటికి బాంబు బెదిరింపు కేసులో కొత్త ట్విస్ట్

New Twist In Mukesh Ambani Plot Case

new twist in mukesh ambani plot case: ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ ఇంటికి బాంబు బెదిరింపు కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. తీహార్ జైల్లోనే ఈ ఘటనకు స్కెచ్ వేశారన్న అనుమానాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. జైష్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థ ఈ కుట్ర వెనుక ఉన్నట్టు తెలుస్తోంది. తీహార్ జైలు నుంచే ఉగ్రవాద చర్యలకు, బెదిరింపులకు ఈ సంస్థ పాల్పడుతున్నట్టుగా తేలింది. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఉగ్రవాదులు ఈ చర్యలకు పాల్పడుతున్నట్టు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భావిస్తున్నారు.

దానికి సంబంధించిన మొబైల్ ఫోన్ తో పాటు సిమ్ ను పోలీసులు సీజ్ చేశారు. ముకేష్ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్దాలతో నింపిన వాహనాన్ని నిలిపిన బాధ్యత తమదేనని జైష్ ఉల్ హింద్ సంస్థ గతవారమే ప్రకటించింది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, పెద్ద ముప్పు ముందుందని, ఈ సంస్థ టెలిగ్రామ్ యాప్ మేసేజ్ లో హెచ్చరించింది. దేవుడిని కానీ, చివరి రోజును కానీ నమ్మని వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, మేసేజ్ లో వెల్లడించింది.

కాగా, దీని వెనుక జైష్ ఉల్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని జరుగుతున్న ప్రచారాన్ని అప్పట్లో ముంబై పోలీసులు తోసిపుచ్చారు. మీడియాలో వస్తున్న కథనాలను ఖండించారు. ఆ సంస్థ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ నకిలీదని చెబుతూ వచ్చారు.

మరోవైపు జైష్ ఉల్ హింద్ సంస్థ పేరుతో వచ్చిన మెసేజ్ లొకేషన్ తీహార్ జైల్లో ఉన్నట్టు ముంబై సైబర్ పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ఢిల్లీ స్పెషల్ పోలీసులకు చెప్పారు. దీంతో ఢిల్లీ స్పెషల్ పోలీసులు తీహార్ జైల్లోని 8వ నెంబర్ సబ్ జైల్లో తనిఖీలు చేశారు. అక్కడ నిజంగానే ఉగ్రవాదులు మొబైల్ వాడుతున్నట్టు నిర్ధారించుకున్నారు. ఇంకా ఆ సబ్ జైల్లో అల్ ఖైదాకు చెందిన ఉగ్రవాది అక్తర్ కూడా ఉన్నాడు. అతడికి అండర్ వరల్డ్ తో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. దీంతో అక్తర్ పైనే ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ హ్యాండ్ సెట్ స్వాధీనం చేసుకున్నారు. తీహార్ సెంట్రల్ జైలు అధికారుల నుంచి సమాచారం స్వీకరించిన తర్వాత తదుపరి దర్యాఫ్తు చేయబోతున్నారు. ఫోరెన్సిక్ సాయం కూడా తీసుకోనున్నారు.

ముకేష్ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్దాలతో నింపిన వాహనం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పేలుడు పదార్దాలతో పాటు వాహనంలో ఓ లేఖ కూడా ఉంది. క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బు ఇవ్వాలని ఆ లేఖలో దుండగులు డిమాండ్ చేశారు.

అంబానీ ఇంటి ముందు కలకలం:
ఫిబ్రవరి 25న ముంబైలోని ముకేష్ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్దాలతో నింపిన వాహనం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పేలుడు పదార్దాలతో పాటు వాహనంలో ఓ లేఖ కూడా ఉంది. క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బు ఇవ్వాలని ఆ లేఖలో దుండగులు డిమాండ్ చేశారు. సౌత్ ముంబైలోని ముకేశ్ అంబానీ ఇల్లు ‘‘ఆంటిలియా” దగ్గర నిలిపి ఉంచిన స్కార్పియో వాహనాన్ని పోలీసులు గుర్తించారు. అందులో పేలుడు పదార్దాలు ఉన్నాయి. అలాగే అందులో అంబానీ కుటుంబానికి దుండగులు రాసిన బెదిరింపు లేఖను కూడా గుర్తించారు.

ఎవరూ గుర్తుపట్టకుండా పీపీఈ కిట్ ధరించాడు:
అంబానీ ఇంటి ముందు జిలెటిన్ స్టిక్స్ నింపిన స్కార్పియో వాహనాన్ని పార్క్ చేసిన నిందితుడు.. దర్జాగా నడుచుకుంటూ వెళ్లి కాస్త దూరంలో నిలిపిన మరో వాహనం(ఇన్నోవా)లో పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో తేటతెల్లమైంది. త‌న‌ను ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌కుండా ఉండేందుకు దుండగుడు పీపీఈ కిట్ ధ‌రించిన‌ట్లు పోలీసులు చెప్పారు.

కారు యజమాని దారుణ హత్య:
కాగా, అంబానీ ఇంటి ముందు గుర్తించిన స్కార్పియోని ఆటోమొబైల్ విడిభాగాల వ్యాపారి మ‌న్సుక్ హిరేన్ ది పోలీసులు గుర్తించారు. ఆ వాహనం.. ఫిబ్ర‌వ‌రి 18న ఐరోలీ ప్రాంతంలో దొంగతనానికి గురికాగా, మ‌న్సుక్ హిరేన్ సైతం గత వారం అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించడం ఈ మిస్ట‌రీని మ‌రింత పెంచింది. బాంబు బెదిరింపు, హిరేన్ మృతి ఘటనలపై వేర్వేరుగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి.. కేసును ఎన్ఐఏకి అప్పగించింది.

బాంబు బెదిరింపు కేసుతోపాటు స్కార్పియో యజమాని హిరేన్ అనుమానాస్పద మృతి కేసుల దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం లాగేసుకుని ఎన్ఐఏకు అప్పగించడంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అనుమానం వ్యక్తం చేశారు. ఇందులో ఏదో మతలబు ఉందని అన్నారు.