INDIA 3rd Meet: ఇండియా కూటమి కన్వీనర్‭గా నితీశ్ కుమార్‭కే ఎక్కువ మద్దతు.. లాలూ పెట్టిన ఈ షరతుకు ఒప్పుకుంటే నితీశే అధినేత

శివసేన, తృణమూల్, ఎస్పీ, ఆర్ఎల్డీ, జేఎంఎం, డీఎంకే, ఎండీఎంకే వంటి పెద్ద పార్టీలు ఇంకా డైలమాలోనే ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో కమిటీ వేసి సీట్ల పంపకాల వివాదాన్ని పరిష్కరించాలని వీటిలో చాలా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇండియా కూటమిలో ప్రస్తుతం 28 పార్టీలు చేరాయి

INDIA 3rd Meet: ఇండియా కూటమి కన్వీనర్‭గా నితీశ్ కుమార్‭కే ఎక్కువ మద్దతు.. లాలూ పెట్టిన ఈ షరతుకు ఒప్పుకుంటే నితీశే అధినేత

Mumbai: ఇండియా కూటమికి కన్వీనర్‭గా నితీశ్ కుమార్‭ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈరోజు, రేపు విపక్షాల మూడవ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లోనే ఇండియా కన్వీనర్‭ను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నితీశ్ కు ఐదు పార్టీల నేతల మద్దతు లభించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 11 మందితో ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఐదుగురి మద్దతు ఉన్నందున నితీశ్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Elon Musk: ట్విటర్‌లో త్వరలో మరో కొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ లేకుండానే ఆడియో, వీడియో కాల్ సదుపాయం..

అయితే సొంత రాష్ట్ర నేత అయిన లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం దీనిపై అప్రకటిత వీటో విధించారు. లాలూ వ్యతిరేకత కారణంగా కోఆర్డినేటర్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మిత్రపక్షాల మధ్య సామరస్యాన్ని నెలకొల్పడానికి ఇండియా కూటమి సమన్వయ కమిటీకి కన్వీనర్ ప్రధాన బాధ్యత తీసుకుంటారు. ఇక కన్వీనర్ సహా ఒక ఛైర్మన్, 9 మంది సభ్యులు ఇందులో ఉంటారు. ఇవే కాకుండా కూటమిలో అధికార ప్రతినిధుల కమిటీ కూడా ఏర్పడుతుంది. ఇది ప్రతి అంశంపై కూటమి ఆలోచనను ప్రదర్శిస్తుంది.

కూటమిలో కోఆర్డినేటర్ పదవి అత్యంత కీలకం కానుందని సమాచారం. సీట్ల పంపకం నుంచి మేనిఫెస్టో ఖరారు వరకు సమన్వయకర్తపైనే బాధ్యత ఉంటుంది.

నితీష్ పేరును అంగీకరించిన నేతలు వీరే..
1. రాహుల్ గాంధీ – నితీష్ కుమార్ ను కన్వీనర్ గా చేసేందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంగీకరించారు. నితీశ్‌ కుమార్‌ను కన్వీనర్ గా చేస్తామని ఏప్రిల్‌లోనే రాహుల్‌ హామీ ఇచ్చారట. ఆ తర్వాతనే ఆయన విపక్షాలను ఏకం చేసే పని ప్రారంభించినట్లు తెలుస్తోంది.

2. శరద్ పవార్ – ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తన కంటే నితీష్ కుమార్ మంచి పోటీదారు అని బహిరంగంగా చెప్పారు. ఇండియా కూటమిలో నితీష్ కుమార్ తర్వాత అతిపెద్ద పోటీదారు పవార్. అయితే పవార్ మాత్రం మహారాష్ట్రపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు.

3. సీతారాం ఏచూరి – సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా నితీష్ కుమార్ కు అనుకూలంగా ఉన్నారు. నితీష్ బీజేపీతో తెగదెంపులు చేసుకున్నప్పుడు ముందుగా ఫోన్ చేసి అభినందనలు తెలిపిన వ్యక్తి ఏచూరి. నితీష్‌ సాయంతో బెంగాల్‌లో లోక్‌సభ సీటు కూడా దక్కించుకోవాలని ఏచూరి భావిస్తున్నారు.

4. డి రాజా – సీపీఐ నేత డీ రాజా కూడా నితీష్ చొరవను ప్రశంసించారు. నితీష్‌కు అనుకూలంగా బిహార్‌లో తన పార్టీ పునాదిని పెంచుకునే పనిలో ఆయన నిమగ్నమై ఉన్నారు. 1990లలో బీహార్‌లో సీపీఐ చాలా బలంగా ఉండేది.

5. అరవింద్ కేజ్రీవాల్ – కూటమిలోని చాలా మంది సామాన్యులు పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. కానీ నితీష్ లాబీయింగ్ కారణంగా ఇండియా కూటమిలోకి ఆప్ వచ్చింది. కేజ్రీవాల్ కూడా నితీష్ సహాయంతో ఎక్కువ సీట్లు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయన మద్దతు కూడా నితీష్‌కే ఉంటుంది.

Uttar Pradesh : నమాజ్ కోసం బస్ ఆపిన కండక్టర్‌ను ఉద్యోగం నుంచి తొలగించిన ప్రభుత్వం .. మనస్తాపంతో ఆత్మహత్య

శివసేన, తృణమూల్, ఎస్పీ, ఆర్ఎల్డీ, జేఎంఎం, డీఎంకే, ఎండీఎంకే వంటి పెద్ద పార్టీలు ఇంకా డైలమాలోనే ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో కమిటీ వేసి సీట్ల పంపకాల వివాదాన్ని పరిష్కరించాలని వీటిలో చాలా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇండియా కూటమిలో ప్రస్తుతం 28 పార్టీలు చేరాయి. బీఎస్పీ, ఐఎన్‌ఎల్‌డీ, ఏఐయూడీఎఫ్‌తో సహా మరో 5 పార్టీలను చేర్చుకునేందుకు కసరత్తు జరుగుతోంది.

నితీష్ పేరుపై లాలూ అప్రకటిత వీటో ఎందుకు పెట్టారు?
నితీష్ కుమార్ ను కన్వీనర్ గా చేయాలని లాలూ యాదవ్ భావిస్తున్నారని, అయితే నితీష్ సీఎం కుర్చీని వదిలి ఢిల్లీకి వెళ్లాలన్నదే ఆయన డిమాండ్ అని ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలోనే ఇండియా అలయన్స్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే చర్చ జరుగుతోంది. ఆగస్టులో జేడీయూ, ఆర్జేడీ పొత్తు పెట్టుకున్నప్పుడే డీల్ కుదిరిందని ఆర్జేడీ నేతలు చెబుతున్నారు. ఇందులోభాగంగా నితీష్ ఢిల్లీకి వెళ్లగానే తేజస్వికి సీఎం కుర్చీ వదిలేయాలి. ఈ డీల్ కారణంగానే జేడీయూ నుంచి ఉపేంద్ర కుష్వాహ బయటికి వచ్చారు. కన్వీనర్ కోసం నితీష్‌కు అనుకూలంగా వాతావరణం ఏర్పడిందని, అయితే లాలూ చేసిన ప్రకటన జేడీయూ సమస్యలను పెంచిందని నిపుణులు అంటున్నారు.

Early Polls: ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు… కేంద్రంలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా?

దీంతో నితీష్ కుమార్ మీడియా ముందుకు వచ్చి నాకు కన్వీనర్ పదవి వద్దు అని చెప్పాల్సి వచ్చింది. ఒకవేళ సమావేశంలో నితీష్ పేరు మీద లాలూ వీటో ప్రకటిస్తే కన్వీనర్ ఎన్నిక వచ్చే సమావేశానికి వాయిదా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. లాలూ అంగీకరిస్తే, సమావేశం తర్వాత నితీష్ పేరును ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.