Bihar New Government: బీహార్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. సీఎంగా నితీష్, డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్‌ ప్రమాణ స్వీకారం

బీహార్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పాట్నాలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.

Bihar New Government: బీహార్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. సీఎంగా నితీష్, డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్‌ ప్రమాణ స్వీకారం

Bihar cm Nitish Kumar

Bihar New Government: బీహార్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పాట్నాలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ తో పాటు డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకొని మహాఘటబంధన్ (RJD, కాంగ్రెస్, లెఫ్ట్)తో ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా పావులు కదిపిన నితీష్ కుమార్.. బుధవారం ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు.

Prashant Kishor on Bihar crisis: నితీష్ నిర్ణయం జాతీయ రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపదు..

బీహార్ రాష్ట్రంలో బీజేపీ, జేడీ(యూ)లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే కొద్దికాలంగా బీజేపీకి నితీష్ కుమార్ కు మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్.. ప్రభుత్వం పడిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగానే సోనియా గాంధీ, ఆర్జేడీ నేతలతో మాట్లాడి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుకు చేశారు.

Bihar Deputy CM బిహార్ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్.. ఆర్‌జేడీకి జాక్‌పాట్!

2020 సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 245 సీట్లున్న బీహార్‌ అసెంబ్లీలో రెండు స్థానాలు నామినేటెడ్‌ కాగా, 243 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మహా ఘట్‌బంధన్‌ కూటమిలోని ఆర్జేడీ 75 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 74, జేడీయూ 43, కాంగ్రెస్‌ 19 సీట్లు గెలిచాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి 122 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, బీజేపీ, జేడీయూ, వీఐపీ, హెచ్‌ఏఎల్‌తో కలిసి నితీశ్‌ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఈ కూటమిలో ఈ ఏడాది ప్రారంభంలో చీలికలు ప్రారంభమయ్యాయి. చివరకు బీజేపీతో నితీశ్‌కుమార్‌ తెగతెంపులు చేసుకొని మహా ఘట్ బంధన్ తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.