Free Ration : ఇక ఉచిత రేషన్ బంద్.. కేంద్రం కీలక ప్రకటన

కరోనా సంక్షోభం కారణంగా ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్రం.. పేదలకు ఉచితంగా ఇస్తున్న రేషన్ ఇక బంద్ కానుంది.

Free Ration : ఇక ఉచిత రేషన్ బంద్.. కేంద్రం కీలక ప్రకటన

Free Ration

Free Ration : కరోనా సంక్షోభం కారణంగా ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పథకం కింద కేంద్రం.. పేదలకు ఉచితంగా ఇస్తున్న రేషన్ ఇక బంద్ కానుంది. ఉచితంగా అందిస్తున్న రేషన్ ను పొడిగించే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. గతేడాది ఏప్రిల్‌ నుంచి మొదలైన ఈ ఉచిత పంపిణీ పథకం ఈ ఏడాది నవంబర్‌ వరకు కొనసాగనుంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న తరుణంలో నవంబర్‌ 30 తర్వాత ఉచిత రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని పొడిగించే ప్రతిపాదన ఇంతవరకు లేదని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు.

EPFOలో వడ్డీ జమ అవుతుందో లేదో తెలుసా? మీ పాస్‌బుక్ చెక్ చేసుకోండిలా!

ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, బహిరంగ మార్కెట్లో ఆహార ధాన్యాల వినియోగం, విక్రయాలు ఈ ఏడాది బాగానే ఉన్న నేపథ్యంలో పీఎంజీకేఏవైని పొడిగించే ప్రతిపాదన లేదని పాండే చెప్పారు.

దేశంలో కరోనా విజృంభణతో గతేడాది(2020) మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ పీఎంజీకేఏవై పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత దీన్ని ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ.. ఆ తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా ఈ ఏడాది(2021) నవంబర్‌ 30 వరకు కేంద్రం పొడిగించింది. ఈ పథకం కింద దేశంలో దాదాపు 80 కోట్లమందికి పైగా లబ్ధిదారులకు జాతీయ ఆహారభద్రత చట్టం కింద రేషన్‌ పంపిణీ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈ ఖర్చును కేంద్రమే భరిస్తూ వస్తోంది.

Third-Party Apps : మీ గూగుల్ అకౌంట్లో థర్డ్ పార్టీ యాప్స్ యాక్సస్ ఆపేయండిలా!

ఈ పథకం కింద అర్హులైన 80 కోట్ల మందికిపైగా ప్రజలకు నెలకు 5కేజీల చొప్పున బియ్యం/గోధుమలు, కుటుంబానికి కేజీ శనగలు ఉచితంగా అందించింది కేంద్రం.