G20 Summit: సదస్సుకు ఏర్పాట్లు.. 1,000 మంది యాచకులను షల్టర్లకు తరలించనున్న అధికారులు

G20 Summit: సదస్సుకు ఏర్పాట్లు.. 1,000 మంది యాచకులను షల్టర్లకు తరలించనున్న అధికారులు

G20 Summit

G20 Summit: భారత్‌లో వచ్చే ఏడాది సెప్టెంబరులో జీ20 సదస్సు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందుకు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని కశ్మీర్ గేట్ ఐఎస్బీటీ సమీపంలోని హనుమాన్ మందిర్ వద్ద నివసించే 1,000 మందికిపైగా యాచకులను జనవరిలో నైట్ షల్టర్లకు అధికారులు తరలించనున్నారు. ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డు (డీయూఎస్ఐబీ)కి ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఆ ప్రాంతం నుంచి యాచకులను నైట్ షెల్టర్లకు తరలించాలని చెప్పింది. డీయూఎస్ఐబీ చీఫ్ ఇంజనీర్ నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందాన్ని ఇప్పటికే నియమించారు. ప్రభుత్వ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ వారు పనిచేస్తారు. గత బుధ, గురు వారాల్లో చేసిన సర్వేలో భాగంగా 1,000 మందికి పైగా యాచకులను అధికారులు గుర్తించారు.

జనవరి మొదటి వారంలో వారందరినీ నైట్ షెల్టర్లకు తరలిస్తామని అధికారులు చెప్పారు. యాచకులుగా జీవిస్తున్న వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, జీ20-2023 సదస్సు లోగో, వెబ్‌సైట్‌ ను ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. సదస్సు నిర్వహణ కోసం ఇప్పటికే అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి మోదీ చర్చించారు.

Artiste Cardiac Arrest : యక్షగాన ప్రదర్శనలో విషాదం.. గుండెపోటుతో స్టేజిపైనే కళాకారుడు మరణం