Artiste Cardiac Arrest : షాకింగ్ వీడియో… యక్షగాన ప్రదర్శనలో విషాదం, గుండెపోటుతో స్టేజిపైనే కళాకారుడు మరణం

యక్షగాన ప్రదర్శనలో విషాదం జరిగింది. శిశుపాలుడి వేషంలో ఉన్న కటీల్ మేళా కళాకారుడు గుండెపోటుతో మరణించాడు. కటిలిన క్షేత్రంలో సరస్వతీ సదన్ లో త్రిజన్మ మోక్ష యక్షగానం జరిగింది. ఈ సందర్భంగా శిశుపాలుడు పాత్రధారి అయిన 58ఏళ్ల గురువప్ప స్టేజిపైన ప్రదర్శన చేస్తుండగానే కుప్పకూలాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

Artiste Cardiac Arrest : షాకింగ్ వీడియో… యక్షగాన ప్రదర్శనలో విషాదం, గుండెపోటుతో స్టేజిపైనే కళాకారుడు మరణం

Artiste Cardiac Arrest : ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఏజ్ తో సంబంధమే లేదు.. సడెన్ గా హార్ట్ ఎటాక్ తో హఠాన్మరణం చెందుతున్నారు. మూడు పదుల వయసు కూడా దాటని వారు, చివరికి యంగర్స్ సైతం గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ పరిణామం ఆందోళనకు గురి చేస్తోంది.

అప్పటివరకు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వారు సడెన్ గా హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా మరణాలు ఎక్కువయ్యాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి కర్నాటక రాష్ట్రం మంగళూరులో చోటు చేసుకుంది.

Also Read..Heart Attack : అవతార్ 2 సినిమా చూస్తున్న వ్యక్తి గుండెపోటుతో మరణం ; ఇలా ఎందుకు జరిగిందన్న దానిపై కార్డియాలజిస్టులు ఏమంటున్నారంటే?

యక్షగాన ప్రదర్శనలో విషాదం జరిగింది. శిశుపాలుడి వేషంలో ఉన్న కటీల్ మేళా కళాకారుడు గుండెపోటుతో మరణించాడు. కటిలిన క్షేత్రంలో సరస్వతీ సదన్ లో త్రిజన్మ మోక్ష యక్షగానం జరిగింది. ఈ సందర్భంగా శిశుపాలుడు పాత్రధారి అయిన 58ఏళ్ల గురువప్ప స్టేజిపైన ప్రదర్శన చేస్తుండగానే కుప్పకూలాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read..Boy Dies With Heart Attack : షాకింగ్.. క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు, అక్కడికక్కడే మృతి చెందిన 16ఏళ్ల బాలుడు

మృతి చెందిన వ్యక్తిని గురువప్ప బయరుగా గుర్తించారు. ఆయన వయసు 58ఏళ్లు. దుర్గాపరమేశ్వరి యక్షగాన బృందంలోని కళాకారుడు. డిసెంబర్ 22న యక్షగాన ప్రదర్శన ఇస్తుండగా గుండెపోటుతో గురువప్ప కన్నుమూశాడు. త్రిజన్మ మోక్ష యజ్ఞ ప్రదర్శనలో గురువప్ప శిశుపాలుడి వేషం వేశాడు. ప్రదర్శన చివరి అంకానికి చేరుకుంది. కాసేపట్లో అయిపోతుంది. ఇంతలో ఊహించిన సంఘటన జరిగింది. గురువప్ప ఒక్కసారిగా స్టేజి పై నుంచి కిందకు పడిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. గురువప్ప మృతి పట్ల తోటి కళాకారులు సంతాపం తెలిపారు. గురువప్ప మంచి కళాకారుడు అని ప్రశంసించారు. తన ప్రతిభతో ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు గురువప్ప.

ఇటీవల మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఓ వివాహ వేడుకలో ఇలాంటి ఘటనే జరిగింది. స్టేజి పై ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఓ పెద్దావిడ హఠాత్తుగా కుప్పకూలింది. గుండెపోటుతో ఆమె మృతి చెందింది. ఆమె కిందపడిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ మహిళ అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.

ఇంతకు ముందు వృద్ధులకు మాత్రమే గుండెపోటు వస్తుందని నమ్మేవారు. అయితే గత కొద్ది రోజులుగా వచ్చిన వార్తలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు వీడియోలు.. ఇది అవాస్తవమని రుజువు చేస్తున్నాయి. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, భారతదేశంలో దాదాపు 50 శాతం గుండెపోటు కేసులు 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో మరియు 25 శాతం 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ఆందోళన కలిగించే అంశం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.