Boy Dies With Heart Attack : షాకింగ్.. క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు, అక్కడికక్కడే మృతి చెందిన 16ఏళ్ల బాలుడు

Boy Dies With Heart Attack : షాకింగ్.. క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు, అక్కడికక్కడే మృతి చెందిన 16ఏళ్ల బాలుడు

Boy Dies With Heart Attack : ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. యాజ్ తో సంబంధమే లేదు.. సడెన్ గా హార్ట్ ఎటాక్ తో హఠాన్మరణం చెందుతున్నారు. మూడు పదుల వయసు కూడా దాటని వారు, చివరికి యంగర్స్ సైతం గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ పరిణామం ఆందోళనకు గురి చేస్తోంది.

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో చనిపోవడం కలకలం రేపింది. టెన్త్ క్లాస్ విద్యార్థి అనూజ్ పాండే.. తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా గ్రౌండ్ లో కిందపడిపోయాడు. దీంతో అతడి సహచరులు కంగారుపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు పాండే దగ్గరికి వెళ్లారు.

Also Read..Woman Dies In Gym : షాకింగ్.. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటుతో యువతి మృతి, వీడియో వైరల్

తల తిరగడంతో పాండే కిందపడిపోయాడని అందరూ అనుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో షాక్ తిన్నారు. బ్యాటింగ్ చేస్తున్న పాండే.. పరుగు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో సడెన్ గా పడిపోయాడు. అతడికి తల తిరగడంతో పాటు ఛాతిలో నొప్పి వచ్చిందని, ఆ తర్వాత నేలపై పడిపోయాడని ఫ్రెండ్స్ చెప్పారు.

అనూజ్ తండ్రి అమిత్ కుమార్ పాండే సీడ్ ఏజెన్సీలో పని చేస్తారు. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. రెండో కుమారుడు అనూజ్ బుధవారం ఉదయం తన ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడని తండ్రి చెప్పారు. క్రికెట్ ఆడుతున్నప్పుడు అనూజ్ స్పృహ తప్పి పడిపోయాడని అతని స్నేహితులు తమకు సమాచారం ఇచ్చారని ఆయన వెల్లడించారు. వెంటనే తన కుమారుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారని.. కాగా, అప్పటికే అనూజ్ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారని అమిత్ పాండే తెలిపారు.

Also Read..Bride Dies Of Cardiac Arrest : పెళ్లిలో తీవ్ర విషాదం.. దండలు మార్చుకుంటుండగా గుండెపోటుతో మండపంపైనే వధువు మృతి

అనూజ్ మరణంతో స్థానికంగా విషాదం అలుముకుంది. అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గుండెపోటుతో అనూజ్ పాండే మరణించాడని డాక్టర్లు చెప్పడంతో అంతా నివ్వెరపోయారు. 16ఏళ్ల బాలుడికి గుండెపోటు రావడం ఏంటని విస్తుపోతున్నారు.

కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్, బాలీవుడ్ సింగర్ కేకే, బాలీవుడ్ యాక్టర్ సిద్ధార్థ్ శుక్లా వంటి ప్రముఖులు సైతం గుండెపోటుతో మరణించారు. చిన్న వయసులోనే ఇలా పలువురు మరణించడం వారి అభిమానులను బాధకు గురిచేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా, ఇటీవలి కాలంలో అన్ని ఏజ్ గ్రూపుల్లో మరీ ముఖ్యంగా యువతలో గుండెపోటు కామన్ గా మారడం ఆందోళనకు గురి చేస్తోంది. ఉన్నట్టుండి హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన కేసులు ఇటీవల ఎక్కువయ్యాయి. మారిన జీవవశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం.. చాలామంది గుండెపోటు బారిన పడేందుకు ప్రధాన కారణాలని డాక్టర్లు చెబుతున్నారు. మూడు పదుల వయస్సులోపు వారు కూడా హార్ట్ ఎటాక్స్ కు గురవుతుండటం ఆందోళన కలిగించే పరిణామం.

Also Read..Soaked Peanuts : రోజుకు గుప్పెడు నానబెట్టిన వేరుశెనగలు తింటే క్యాన్సర్, గుండె వ్యాధులు దరిచేరవు?