Parliament : నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు… కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లులపై ఉత్కంఠ

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండాపై పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వకపోవడంపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్రం తొలి రెండు రోజుల ఏజెండాపై మాత్రమే క్లారిటీ ఇవ్వడంపై విపక్షాల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Parliament : నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు… కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లులపై  ఉత్కంఠ

Parliament special session

Parliament Special Session : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేటి (సోమవారం) నుంచి జరుగనున్నాయి. సెప్టెంబర్ 22 వరకు 5 రోజులపాటు సమావేశాలు కొనసాగనున్నాయి. తొలి రోజు పాత పార్లమెంట్ భవనంలోనే సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం 9: 30 గంటలకు పాత పార్లమెంట్ ముందు పార్లమెంట్ సభ్యులతో గ్రూప్ ఫోటో సెషన్ ఉంటుంది. మొదటిరోజు 75 సంవత్సరాల పార్లమెంటరీ వ్యవస్థ ప్రయాణం – విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, అభ్యాసాలు అనే అంశంపై చర్చ జరుగనుంది. వినాయక చవితి పర్వదినాన కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాల నిర్వహించనున్నారు.

రెండో రోజు నుంచి కొత్త భవనంలో సమావేశాలు జరగనున్నాయి. రేపు (మంగళవారం) కొత్త పార్లమెంట్ భవనం ముందు ఫోటో సెషన్ ఉంటుంది. ఆ తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హల్ లో కేంద్రం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. లోక్ సభ ముందుకు ధి అడ్వాకేట్ అమెండమెంట్ బిల్ 2023, ధి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పెరియడికల్స్ బిల్ 2023 రానున్నాయి. రాజ్యసభ ఆమోదం కోసం ధి పోస్ట్ ఆఫీస్ బిల్ 2023, ఎలెక్షన్ కమిషనర్ ఎలెక్షన్ కమిషన్ సిబ్బంది నియామకాలకు సంబంధించిన బిల్లులు సభ ముందుకి రానున్నాయి.

CJI Chandrachud: ప్రపంచం మొత్తాన్ని మోసం చేయవచ్చు, కానీ మన మనస్సాక్షిని చేయలేం.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండాపై పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వకపోవడంపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్రం తొలి రెండు రోజుల ఏజెండాపై మాత్రమే క్లారిటీ ఇవ్వడంపై విపక్షాల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మిగతా మూడు రోజుల ఏజెండా ఏంటో తెలపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఉదయం 10:15 గంటలకు పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడనున్నారు.

మరోవైపు ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ఎటువంటి బిల్లులను ప్రవేశపెడుతుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. యూనిఫామ్ సివిల్ కోడ్, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఓబీసీ వర్గీకరణ, జమిలి ఎన్నికలు, ఇండియా పేరును భారత్ గా మార్పు సహా కీలక అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగింది. మరోవైపు ప్రజా సమస్యలను పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు ఇండియా కూటమి పార్టీలు సిద్ధమయ్యాయి.

SBI Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎస్బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పోస్టులు, అర్హతలు

ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరుద్యోగం, అసమానతల పెరుగుదల, ఎమ్ ఎస్ ఎమ్ ఈల ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రైతు సమస్యలు, అదానీ షేర్ల వ్యవహారంపై జెపిసి ఏర్పాటు, మణిపూర్ ప్రజా సమస్యలు, హర్యానాలో మతపరమైన ఉద్రిక్తతలు, చైనా భారత భూభాగాన్ని ఆక్రమించడం, కుల గణన, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, వివిధ రాష్ట్రాల్లో విపరీతమైన వరదలు, ప్రకృతి వైపరీత్యాల అంశాలపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.