Pension : పెన్షన్లరకు అలర్ట్.. వెంటనే ఆ సర్టిఫికెట్ సబ్మిట్ చేయండి.. లేదంటే పెన్షన్ రాదు

మీరు పెన్షనరా? ప్రతి నెల ఫించన్ వస్తుందా? అయితే మీకో అలర్ట్. వెంటనే మీరు ఓ పని చేయాలి. ఓ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయాలి. లేదంటే.. వచ్చే నెల నుంచి మీకు పెన్షన్ రాదు.

Pension : పెన్షన్లరకు అలర్ట్.. వెంటనే ఆ సర్టిఫికెట్ సబ్మిట్ చేయండి.. లేదంటే పెన్షన్ రాదు

Pension

Pension : మీరు పెన్షనరా? ప్రతి నెల ఫించన్ వస్తుందా? అయితే మీకో అలర్ట్. వెంటనే మీరు ఓ పని చేయాలి. ఓ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయాలి. లేదంటే.. వచ్చే నెల నుంచి మీకు పెన్షన్ రాదు. అవును.. ఇక నెలనెలా పెన్షన్ రావాలంటే లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. ఈ కొత్త పెన్షన్ రూల్స్ వివరాలు మీ కోసం..

ఇకపై ప్రతినెలా పెన్షన్ అందాలంటే లబ్ధిదారులు కచ్చితంగా వార్షిక జీవన ధ్రువీకరణ పత్రం లేదా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. అక్టోబర్ నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ డాక్యుమెంట్ అందించని వారికి పెన్షన్ నిలిచిపోతుందని తెలిపింది.

పెన్షనర్లు వ్యక్తిగతంగా లేదా ఆన్ లైన్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ లేదా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‎ను సబ్మిట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‎ అయితే నవంబర్ చివరి నాటికి సబ్మిట్ చేయవచ్చు. ఈ సర్టిఫికెట్‎ను ఆన్ లైన్‎లో సబ్మిట్ చేస్తే దాన్ని డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‎గా పిలుస్తున్నారు.

Basil : తులసితో మానసిక ఒత్తిడి మాయం..!

పెన్షనర్లు ఈ లైఫ్‌ సర్టిఫికెట్‌ను వివిధ మార్గాల్లో సబ్మిట్ చేయవచ్చు. అందులో ఆన్ లైన్ ద్వారా అందించడం ఒక ఆప్షన్. భారతదేశంలో లేనటువంటి పెన్షనర్లు లేదా ఫ్యామిలీ పెన్షనర్లు మెజిస్ట్రేట్, నోటరీ, బ్యాంకర్ లేదా డిప్లొమాటిక్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా సంతకం చేసిన లైఫ్ సర్టిఫికెట్‎ను ఆథరైజ్డ్ ఏజెంట్ ద్వారా సబ్మిట్ చేయవచ్చు. ఇందుకు పెన్షనర్ నేరుగా సబ్మిషన్ కోసం హాజరు కానవసరం లేదు.

లైఫ్ సర్టిఫికెట్‎ని ఆధార్-ఆధారిత బయోమెట్రిక్ ఆథెంటికేషన్ సిస్టం ద్వారా కూడా సబ్మిట్ చేయవచ్చు. ఇందుకు https://jeevanpramaan.gov.in కి వెళ్లి సబ్మిషన్ ప్రాసెస్‎ను స్టార్ట్ చేయవచ్చు. లైఫ్ సర్టిఫికెట్ల సబ్మిషన్ కోసం ఎంబసీ ఆఫ్ ఇండియా, హై కమిషనర్ లేదా ఇండియన్ కాన్సులేట్ పూర్తిగా పెన్షనర్లకు సహకరించేలా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

Caffeine : టీ,కాఫీలలో ఉండే కెఫిన్ వల్ల ఆరోగ్యానికి నష్టమా?..లాభమా?

వ్యక్తిగతంగా హాజరుకాలేని ఎన్నారై పెన్షనర్లు PPO మీద ఫోటోను అతికించడం ద్వారా.. లేదా పెన్షనర్ పాస్‎పోర్ట్ మీద ఉండే ఫోటో ఆధారంగా లేదంటే అందుకు సమానమైన డాక్యుమెంట్ల మీద ఉండే ఫోటో ఆధారంగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఒకవేళ ఎంబసీ లేదంటే కాన్సులేట్ వరకు వెళ్లలేని స్థితిలో పెన్షనర్లు ఉంటే, అందుకు గల కారణాలను వివరిస్తూ డాక్టర్ సర్టిఫికేట్‎ జతచేయాల్సి ఉంటుంది.

ఇందుకోసం ఎంబసీ ఆఫ్ ఇండియా, హై కమిషనర్ లేదా ఇండియన్ కాన్సులేట్ తగిన సాయం చేస్తారు. అక్టోబర్ 1, 2021 నుంచి పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేసిన జీవన్ ప్రమాణ్ సెంటర్లు(JPCs)లలో ఆన్ లైన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‎ సబ్మిట్ చేయవచ్చు

అయితే 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన పెన్షనర్లు ఒక నెల వరకు అదనంగా సమయాన్ని కలిగి ఉంటారు. అంటే వీరు నవంబర్ 30, 2021 వరకు సదరు సర్టిఫికేట్‎ను సబ్మిట్ చేయవచ్చు. ఈమేరకు హెడ్ పోస్టాఫీసుల్లో జీవన్ ప్రమాణ్ సెంటర్లను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.