Petrol Diesel Prices : 18 రోజుల విరామం తర్వాత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో 18 రోజుల విరామం తర్వాత మంగళవారం (మే 4) పెట్రోల్, డీజిల్ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు పెరిగింది. అలాగే డీజిల్ ధర లీటర్ కు 16 పైసలు పెరిగింది.

Petrol Diesel Prices : 18 రోజుల విరామం తర్వాత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol And Diesel Prices Hiked After 18 Days

Petrol Diesel Prices hike : దేశంలో 18 రోజుల విరామం తర్వాత మంగళవారం (మే 4) పెట్రోల్, డీజిల్ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు పెరిగింది. అలాగే డీజిల్ ధర లీటర్ కు 16 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.9056గా ఉంది. డీజిల్ లీటర్ ధర రూ.80.73కు పెరిగింది. ఏడాది కాలంలో పెట్రోల్ ధర రూ.21.58 పెరగగా.. డీజిల్ పై రూ.19.18 పెంచాయి ఆయిల్ కంపెనీలు.

గత నెల 15వతేదీన పెట్రోల్ ధర లీటరుకు 16 పైసలు, డీజిల్ ను 14 పైసలు తగ్గించారు. ముంబై నగరంలో పెట్రోల్ లీటరు ధర రూ.96.83, డీజిల్ ధర రూ. 87.81కు పెరిగింది. చెన్నైలో పెట్రోలు రూ.92.43, డీజిల్ రూ.85.75 పెరగగా.. కోల్ కతాలో పెట్రోల్ రూ.90.62, డీజిల్ లీటరు ధర రూ.83.61కు పెరిగింది. ఢిల్లీలో కేంద్రప్రభుత్వం లీటరు పెట్రోల్ ధర రూ.32.98గా ఉంది.

రాష్ట్ర ప్రభుత్వ అమ్మకపు పన్ను వ్యాట్ రూ.19.55గా ఉంది. లీటరు డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ రూ.31.83, వ్యాట్ రూ.10.99 వసూలు చేస్తోంది. కరోనా కారణంగా దేశంలో మొత్తం ఇంధన డిమాండ్ 7 శాతం తగ్గిందని మార్కెట్ విశ్లేషుకులు చెబుతున్నారు.