ఒడిషాలో అరుదైన బ్లాక్ టైగర్

  • Published By: Chandu 10tv ,Published On : November 5, 2020 / 11:37 AM IST
ఒడిషాలో అరుదైన బ్లాక్ టైగర్

Black Tiger : నల్లపులిని మీరెప్పుడైనా చూశారా? వీటి గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే చూడండి. అచ్చం నల్ల రంగులో ఉండే ఈ పులి ఒడిషాలోని తూర్పు ప్రాంతంలో కనిపించింది. ఇది చాలా అరుదైన జాతికి చెందినవి. సౌమెన్ బాజ్ పేయీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఈ అరుదైన జాతికి చెందిన నల్ల పులిని ఫోటోలు తీశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



జన్యుపరమైన లోపం కారణంగా కొన్ని పులులు నల్లగా జన్మిస్తాయి. వీటిని మెలనిస్టిక్ టైగర్ అని పిలుస్తారు. ఈ పులి చర్మం పై ఉండే మందపాటి నల్లటి చారలు శరీరంపై ఉండే నారింజరంగు జూలుతో కప్పేస్తాయని, అందుకే ఇవి నల్లగా కనిపిస్తాయి. ఇవి ఎంత అరుదైనవి అంటే… ప్రపంచం మెుత్తం మీద ఇలాంటివి ఆరేడు మాత్రమే ఉన్నాయి. అందులో ఇదొకటి… ఇంకా ఉన్న ఆరేడు పుల్లులు మన పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రంలోనే ఉండటమే విశేషం. ఒడిషాలోని సిమ్లిపాల్ రిజర్వులో ఈ నల్ల పులులు ఉన్నాయి. మెుట్టమెుదటి సారి ఈ నల్లపులులు 2007లో రిజర్వులో కనిపించినట్టు నిపుణులు చెప్పుకొచ్చారు.



https://10tv.in/four-rare-golden-tiger-cubs-more-precious-than-giant-pandas-born-in-chinese-zoo-video-went-viral/
కోల్‌కతాకు చెందిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌ సౌమన్‌ స్పందిస్తూ… ఇంతటి అరుదైన నల్ల పులిని ఫోటోలు తీయగలగడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఇలాంటి అరుదైన నల్ల పులిని ఫోటోలు తీయటమనేది జీవితంలో ఒక్కసారి వచ్చే ఛాన్స్… ఆ పులి కొన్ని సెకన్లపాటు మాత్రమే కనిపించింది. వీటిని ఫోటోలు తీయటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ ఇది నల్ల పులి. ఇవీ బయటకు కనిపించటమే చాలా అరుదు.. అలాంటిది వాటిని చూసి ఫోటోలు తీయటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నాడు. తాను ఎంతో హ్యాపీగా ఉన్నానని సౌమన్ చెప్పారు.



వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, శాస్త్రవేత్త డాక్టర్ బివాష్ పాండవ్ ప్రకారం.. భారతదేశంలో మెుట్టమెుదటిసారిగా 1990లో ఈ నల్ల పులులను గుర్తించబడ్డాయని తెలిపారు. ఇవి ప్రపంచంలోనే చాలా ప్రత్యేకమైనవి. ఈ నల్ల పులులు సాధారణంగా చాలా చిన్నవిగా ఉంటాయని ఆయన తెలిపారు. ఇవి ఒడిషా ప్రాంతంలో ఉండటానికి కారణం ఇక్కడ ఎక్కువగా అడవులు ఉండటమే కారణం అని ఆయన పేర్కొన్నాడు.