గల్లీ క్రికెట్..కాళ్లు లేకుండా సూపర్ షాట్..వీడియో వైరల్

  • Published By: madhu ,Published On : December 27, 2019 / 12:26 PM IST
గల్లీ క్రికెట్..కాళ్లు లేకుండా సూపర్ షాట్..వీడియో వైరల్

ఆత్మ విశ్వాసం ముందు వైకల్యం చిన్నబోయింది. వికలాంగుడినని, ఆత్మనూన్యతా భావానికి లోను కాలేదు ఆ బాలుడు. గల్లీ క్రికెట్‌లో అతను కొట్టిన షాట్..రన్నింగ్ తీసిన దృశ్యాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్రీడను ప్రేమించడానికి ఒక ఉదహారణ అని, రియల్ హీరో అంటూ కితాబినిస్తున్నారు. ప్రముఖులు సైతం దీనిపై స్పందిస్తున్నారు. వీడియోను రీ ట్వీట్ చేస్తున్నారు. కాసేపటికే ఈ వీడియో వైరల్ అయిపోయింది. ఎక్కడ జరిగిందో కానీ తెలియరాలేదు. 

 

భారతదేశంలో క్రికెట్ ఆటకు ఉన్న ఆదరణ అంతా..ఇంత కాదు. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ ఆట ఆడుతుంటారు. ఓ బాలుడు క్రికెట్ ఆడుతున్నాడు. బ్యాట్‌తో రెడీగా ఉన్నాడు. అవతలి నుంచి మరో బాలుడు బాల్ విసిరాడు. వెంటనే అతను షాట్ కొట్టి..ముందుకు పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. వీడియో చూస్తున్న వారికి అప్పుడర్థమైంది. షాట్ కొట్టిన వ్యక్తికి రెండు కాళ్లు చచ్చుబడ్డాయని. అయినా..సరే..రనౌట్ కాకుండా..స్పీడుగా పరుగెత్తే ప్రయత్నం చేశాడు.

Read More : బాలికపై హత్యాచారం కేసు..కామాంధుడికి మరణ శిక్ష

ఈసారి మరో బాలుడు షాట్ కొట్టాడు. అంతే స్పీడుగా మరోసారి పరుగెత్తించిన దృశ్యాలు అందరినీ కదిలించి వేస్తున్నాయి. వికలాంగుడైన ఆ బాలుడికి క్రికెట్‌పై ఎంత మక్కువ ఉందో అర్థమౌతోందంటున్నారు నెటిజన్లు. సుధా రామెన్ IFS W ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. క్రికెట్ ఇష్టపడే వారు..ఇష్టపడని వారు ఈ వీడియోను చూడాలని చెప్పారు. అబ్బాయి వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. 57 సెకండ్లు ఉన్న ఈ వీడియో 55.6 K వ్యూస్‌తో దూసుకపోతోంది. ఈ వీడియోను మరింత మంది రీ ట్వీట్ చేశారు.