విమానంలో గైడ్ గా వ్యవహరిస్తున్న Pilot..అతని గురించి పూర్తి వివరాలు

  • Published By: madhu ,Published On : July 22, 2020 / 07:42 AM IST
విమానంలో గైడ్ గా వ్యవహరిస్తున్న Pilot..అతని గురించి పూర్తి వివరాలు

విమానంలో పైలట్ గైడ్ గా వ్యవహరించడం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారు కదూ. కానీ నిజంగానే విమానంలో ప్రయాణిస్తున్న వారికి ముఖ్యమైన ప్రదేశాలు, వాటి గురించి తమిళంలో చెబుతున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. చెన్నై – మధురై విమానంలో కావేరి, కొల్లిడమ్, శ్రీరంగంలోని రంగనాథ ఆలయం, తిరుచ్చి, ఇతర ప్రముఖ ప్రదేశాల గురించి ఆయన వివరిస్తుంటారు. ఆయనే..pilot, Capt. Priyavignesh.

ఆయన వివరిస్తున్న సమయంలో ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా వినడం వీడియోలో కనిపిస్తుంది. కిటికీలో నుంచే వివరిస్తున్న ప్రదేశాలను చూస్తారు. కెప్టెన్ ప్రియా విగ్నేష్ కు తల్లి తవమణి, తండ్రి గోవింద స్వామిలున్నారు. చిన్నప్పటి నుంచి తనకు విమానాలంటే ఇష్టమని చెన్నైకి చెందిన ప్రియా విగ్నేష్ వెల్లడించారు.

తన తల్లి చిన్నతనంలో విమానాలు, పైలట్ల కథలను వినిపించేదన్నారు. దీంతో తనకు తాను పైలట్ గా ఊహించుకొనే వాడినని తెలిపారు. తల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా…తండ్రి చిన్న దుకాణం నిర్వహించే వాడు. పైలట్ కావడానికి ఉత్సాహపరిచేవారు. ప్రేరేపించేవారు. కవితా పారాయణాలు, ఇతర పోటీల్లో పాల్గొనాలని పేరెంట్స్ ప్రోత్సాహించే వారు.

చరిత్రను చదవడం ద్వారా..ముఖ్యమైన ప్రదేశాలను గుర్తించడం జరిగిందన్నారు. తాను లయోలా కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ హిస్టరీలో చేరాను..తర్వాత మద్రాస్ ఫ్లయింగ్ క్లబ్ లో చేరానన్నారు. కానీ ఇవన్ని నేరవేరడానికి తన తల్లి 90 ఏళ్ల ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను అప్పగించడమే కాకుండా..తమకు ఉన్న చిన్నపాటి భూమిని తాకట్టు పెట్టారని వెల్లడించారు.

అహ్మదాబాద్ ఫ్లయింగ్ క్లబ్ లో చేరడానికి ఆ భూమిని విక్రయించారన్నారు. తాను తమిళంలో స్పష్టంగా మాట్లాడటానికి కారణం తన తల్లేనన్నారు. ముఖ్యమైన ప్రదేశాలను ప్రయాణికులకు తెలియచేసే విధంగా అనుమతించినందుకు ఇండిగో ఎయిర్ లైన్స్ కు రుణపడి ఉంటానన్నారు. కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తున్న క్రమంలో పైలట్ చేస్తున్న ఈ ప్రక్రియ ద్వారా ప్రయాణికులకు కాస్త ఒత్తిడి తగ్గిపోతోంది.