PM Modi : నూతన పార్లమెంట్ 140 కోట్ల మంది ఆకాంక్షల ప్రతిబింబం.. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి : ప్రధాని మోదీ

ఇది ప్రపంచ ప్రజాస్వామ్యానికి పునాది కూడా అని వెల్లడించారు. ప్రజాస్వామ్యం మన సంస్కారం ఆలోచన సంప్రదాయం అని అన్నారు. అనేక సంవత్సరాల విదేశీ పాలన మన గర్వాన్ని మన నుండి దొంగిలించిందని పేర్కొన్నారు.

PM Modi : నూతన పార్లమెంట్ 140 కోట్ల మంది ఆకాంక్షల ప్రతిబింబం.. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి : ప్రధాని మోదీ

PM Modi - new Parliament

New Parliament Building : నూతన పార్లమెంట్.. ఒక భవనం కాదని 140 కోట్ల మంది ఆకాంక్షల కలల ప్రతిబింబం అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఆత్మ నిర్బర్ భారత్ కి సాక్షిగా పార్లమెంట్ నిలుస్తుందన్నారు. వికసిత్ భారత్ ను నూతన పార్లమెంట్ చూస్తుందని తెలిపారు. ప్రతి దేశం అభివృద్ధి ప్రయాణంలో కొన్ని క్షణాలు అజరామరంగా మారతాయిని.. మే 28 అటువంటి రోజు అని పేర్కొన్నారు. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

ఇది నూతన భారతానికి నాంది అని పేర్కొన్నారు. భారత్ ముందుకు వెళ్తే ప్రపంచం ముందుకు వెళ్తుందన్నారు. పవిత్ర సెంగోల్ ను లోక్ సభలో ప్రతిష్టించామని, పవిత్ర సెంగోల్ ను గౌరవ మర్యాదలు తిరిగి తెచ్చామని చెప్పారు. ఈ కొత్త పార్లమెంటు భారతదేశ అభివృద్ధి ,ప్రపంచ అభివృద్ధికి కూడా దారి తీస్తుందన్నారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి అని అభివర్ణించారు. ప్రజాస్వామ్యం ఒక వ్యవస్థ కాదు..ఒక సంస్కారం, ఒక భావం అని పేర్కొన్నారు.

New Parliament : పార్లమెంట్ కట్టడం అద్భుతాల దర్పణం.!

చోళ రాజవంశంలో, ‘సెంగోల్’ న్యాయం, ధర్మం సుపరిపాలనకు ప్రతీక అని అన్నారు. ఆజాదికా అమృత్ కాల్ దేశానికి దిశను నిర్దేశించే అమృత్ కాలం అని తెలిపారు. పవిత్ర ‘సెంగోల్’ మర్యాదను గౌరవాన్ని పునరుద్ధరించడం మన అదృష్టం అన్నారు. ఈ సభలో కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడల్లా ‘సెంగోల్’ మనకు స్ఫూర్తినిస్తుందన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది అని అన్నారు.

ఇది ప్రపంచ ప్రజాస్వామ్యానికి పునాది కూడా అని వెల్లడించారు. ప్రజాస్వామ్యం మన సంస్కారం ఆలోచన సంప్రదాయం అని అన్నారు. అనేక సంవత్సరాల విదేశీ పాలన మన గర్వాన్ని మన నుండి దొంగిలించిందని పేర్కొన్నారు. నేడు, భారతదేశం ఆ వలస మనస్తత్వాన్ని వదిలివేసిందని చప్పారు.

PM Modi : మన్ కీ బాత్‍లో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన ప్రధాని

బీజేపీ 9 ఏళ్ళ పాలన, అభివృద్ధి పనులను పార్లమెంట్ లో ప్రధాని మోదీ ప్రస్తావించారు. దేశ అభివృద్ధే.. దేశ ప్రజల అభివృద్ధి అని పేర్కొన్నారు. మరో 25 ఏళ్లలో భారత్ 100 ఏళ్ల స్వాతంత్య్రాన్ని జరుపుకుంటుందన్నారు. 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నారు. భారత్ ను చూసి అనేక దేశాలు ప్రేరణ పొందుతాయని చెప్పారు. భారత్ లో వేగంగా పేదరికం దూరం అవుతుందన్నారు.

పార్లమెంట్ భవనం ప్రతి భారతీయుడిలో కర్తవ్య భావాన్ని పెంపొందిస్తుందని వెల్లడించారు. నేషన్ ఫస్ట్ అన్న భావన ఉండాలని తెలిపారు. నూతన పార్లమెంట్ దేశానికి నూతన బలాన్ని ఇస్తుందన్నారు. వచ్చే 25 ఏళ్ళలో పార్లమెంట్ లో చేసే చట్టాలు భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తాయని చెప్పారు.