Heavy Rainfall In Kerala : 21కి చేరిన మృతుల సంఖ్య..కేరళ సీఎంకి మోదీ ఫోన్

కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. కొట్టాయం జిల్లాలోని ముందక్కయమ్​లో నది ఉప్పొంగి రెండంతస్తుల బిల్డింగ్

Heavy Rainfall In Kerala : 21కి చేరిన మృతుల సంఖ్య..కేరళ సీఎంకి మోదీ ఫోన్

Kerala

Heavy Rainfall In Kerala  కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. కొట్టాయం జిల్లాలోని ముందక్కయమ్​లో నది ఉప్పొంగి.. రెండంతస్తుల బిల్డింగ్  కొట్టుకుపోయింది. అప్పటికే అందులో ఉండే కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించటం వల్ల ప్రమాదం తప్పింది. ఇక, వేరువేరు ఘటనల్లో ఇప్పటివరకు 21మంది మరణించగా..పలువురు గల్లంతయ్యారు.

కేరళలో తాజా పరిస్థితులపై సీఎం పినరయి విజయన్​తో ఫోన్ లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ ఓ ట్వీట్ లో తెలిపారు. క్షతగాత్రులు, బాధితులకు అండగా నిలిచేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు కృషి చేస్తున్నారన్నారు. కేరళవాసులు సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ తెలిపారు.

మరోవైపు,ముప్పు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు అనేక ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. వరదలు, కొండచరియలు విరిగి పడిన ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్​ను చేపట్టి గల్లంతైన వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాలినడకన చేరలేని ప్రదేశాలకు వాయుమార్గం ద్వారా వెళ్లి ఆహార పొట్లాలు, నిత్యవసర సామగ్రిని అందిస్తున్నాయి. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చిన్నపిల్లలు, మహిళలు, ముసలివారిని రక్షించి పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తీసుకెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ALSO READ Babul Supriyo : ఎంపీ పదవికి బాబుల్ సుప్రియో రాజీనామా!