Babul Supriyo : ఎంపీ పదవికి బాబుల్ సుప్రియో రాజీనామా!

గత నెలలో బీజేపీని వీడి టీఎంసీలో చేరిన అసన్సోల్‌ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి బాబుల్‌ సూప్రియో మంగళవారం(అక్టోబర్-19)ఎంపీ పదవికి రాజీనామా

Babul Supriyo : ఎంపీ పదవికి బాబుల్ సుప్రియో రాజీనామా!

Babul

Babul Supriyo  గత నెలలో బీజేపీని వీడి టీఎంసీలో చేరిన అసన్సోల్‌ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి బాబుల్‌ సూప్రియో మంగళవారం(అక్టోబర్-19)ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు స్పీకర్‌ ఓం బిర్లా అపాయింట్‌మెంట్‌ ను బాబులు సుప్రియో కోరినట్లు సమాచారం. 2014 మరియు 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి అసన్సోల్‌ ఎంపీగా గెలిచిన బాబుల్ సుప్రియో ఈ ఏడాది జులై వరకు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బాబుల్ సుప్రియో…జూలైలో జరిగిన కేంద్రమంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవిని కోల్పోయారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత సుప్రియో కలత చెందారు. ఆ రోజే ఆయన తాను ఆవేదన లో ఉన్నారని ట్వీట్ చేశారు. ఆపై ఆ పోస్టు ను తొలగించి తనపై ఎలాంటి అవినీతి మచ్చలేకుండా పదవి నుండి తప్పుకున్నందుకు సంతోషంగా ఉంది అంటూ మరో ట్వీట్ చేశారు.

కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగిన బాబుల్ సుప్రియో తనను మంత్రి వర్గం నుండి తప్పించటంతో తీవ్ర మనస్తాపానికి గురై గత నెలలో భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి టీఎంసీలో చేరారు.

ALSO READ అమోధ్య మందిరానికి స్పెషల్ డిజైన్..శ్రీరామనవమి రోజున గర్భగుడిలో సూర్యకిరణాలు