Subramanian Swamy: సొంత పార్టీని మరింత ఇరుకున పెట్టిన సుబ్రహ్మణ్య స్వామి.. అదానీ ఆస్తులపై సంచలన వ్యాఖ్యలు

నిర్మలా సీతారామన్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేట్టినప్పటి నుంచి ఆమెపై విమర్శలు చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి.. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఓ బోగస్‌ అంటూ మండిపడ్డారు. దేశ వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మల చేసిన ప్రకటనను స్వామి తోసిపుచ్చారు. కొన్నేళ్లుగా దేశ వృద్ధి రేటు 3 నుంచి 4 శాతం మాత్రమే ఉంటోందని, అయితే వచ్చే ఏడాదికి 6.5 శాతం వృద్ధి రేటు ఉంటుందని చెప్పడమేంటని, 2019 నుంచి లేనిది ఇప్పుడెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

Subramanian Swamy: సొంత పార్టీని మరింత ఇరుకున పెట్టిన సుబ్రహ్మణ్య స్వామి.. అదానీ ఆస్తులపై సంచలన వ్యాఖ్యలు

Subramanian Swamy: అదానీ గ్రూపుల వ్యవహారంపై అధికార, విపక్షాల నడుమ పార్లమెంట్ వేదికగా హైడ్రామా కొనసాగుతోంది. అదానీకి దేశ ఆస్తులు కట్టబెడుతున్నారంటూ విపక్షాలు ఏనాటి నుంచో ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా అమెరికా పరిశోధక సంస్థ హిండెన్ బర్గ్ నివేదిక, ఆ ఆరోపణలకు అస్త్రాలు ఇచ్చినట్టైంది. దీనికి తోడు ఆ నివేదిక అనంతరం హిండెన్‌ బర్గ్‌ నివేదిక బయటికి రాగానే అదానీ గ్రూపు షేర్లు క్రమంగా పతనం అవ్వడం ఆ అస్త్రాలకు మరింత పదును దొరికింది. అంతే, బడ్జెట్ సమావేశాలు కాస్త అదానీ సమావేశాలు అయ్యాయి. ఎందుకంటే ఈ సెషన్‭లో బడ్జెట్ కంటే ఎక్కువగా అదానీ గురించే చర్చ జరుగుతోంది.

Gurugram Couple: దంపతులు కాదు.. రాక్షసులు! 14 ఏళ్ల బాలికను హింసించిన జంట.. ఇంట్లో పని చేయించుకుంటూ దారుణం

ఇక విపక్షాల ఒత్తిడే తట్టుకోలేక పోతున్న కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతలకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు మరింత తలనొప్పిగా మారాయి. ఒకరకంగా చెప్పాలంటే స్వామి వ్యాఖ్యలు బీజేపీని ఇరకాటంలోకి నెట్టినట్టే కనిపిస్తున్నాయి. ఎందుకంటే, అదానీ ఆస్తులను ఆయన జాతీయం చేయాలని అన్నారు. అదానీ గ్రూపు ఆస్తులను కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసి.. వాటిని వేలం వేయాలని కోరుకుంటున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Hindenburg was in India: ’హిండెన్‌బర్గ్’ భారతదేశంలో ఉంటే.. అదే జరిగేది : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు

‘‘అదానీ గ్రూపులకు చెందిన ఆస్తులన్నీ జాతీయం చేసి వాటిని వేలం వేయాలి. వచ్చిన నగదును ఇందులో నష్టపోయిన వారికి సహాయంగా అందజేయాలి. అదానీతో ఒప్పందాలు లేవని కాంగ్రెస్‌ చెబుతోంది. కానీ, అందులో అదానీతో ఒప్పందాలు ఉన్న వ్యక్తులు ఎవరెవరో నాకు తెలుసు. అయినా కాంగ్రెస్‌ను పట్టించుకోను. బీజేపీ పవిత్రతను నిరూపించుకోవాలని మాత్రమే నేను కోరుకుంటున్నా. ప్రధాని మోదీ ఏదో దాచిపెడుతున్నారని ప్రజల్లో ఒక భావన ఉంది. దానిపై స్పష్టతనిచ్చే బాధ్యత ప్రభుత్వానిదే’’ అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు.

PM Modi Blue Jacket: ప్రధాని మోదీ ధరించిన బ్లూ జాకెట్‭ వెనుక గ్రీన్ సందేశం

ఇక, నిర్మలా సీతారామన్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేట్టినప్పటి నుంచి ఆమెపై విమర్శలు చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి.. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఓ బోగస్‌ అంటూ మండిపడ్డారు. దేశ వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మల చేసిన ప్రకటనను స్వామి తోసిపుచ్చారు. కొన్నేళ్లుగా దేశ వృద్ధి రేటు 3 నుంచి 4 శాతం మాత్రమే ఉంటోందని, అయితే వచ్చే ఏడాదికి 6.5 శాతం వృద్ధి రేటు ఉంటుందని చెప్పడమేంటని, 2019 నుంచి లేనిది ఇప్పుడెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. బడ్జెట్‭లో వ్యవసాయం, పరిశ్రమలకు అందులో ప్రాధాన్యతే లేదని, ప్రభుత్వానికి ఎటువంటి వ్యూహం లేదని బడ్జెట్‌లో స్పష్టంగా తెలుస్తోందని సుబ్రహ్మణ్య స్వామి విమర్శలు గుప్పించారు.